ధృవ బ్రూస్ లీ కన్నా దారుణమా? | Dhruva collections weak than Bruce Lee in Overseas.

Dhruva movie first day collections

Ram Charan Dhruva Movie, Dhruva First Day Collections, Dhruva Collections, Dhruva Overseas collections, Dhruva Telugu states collections, Dhruva Collections, Dhruva First day report, Dhruva First Day, Dhruva Bruce Lee, Dhruva Ram Charan, Ram Charan Dhruva First day Collections

Ram Charan Starrer Dhruva Movie First Day over all collections.

ధృవ కలెక్షన్లు మరీ అంత దారుణమా?

Posted: 12/10/2016 12:17 PM IST
Dhruva movie first day collections

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధృవ సినిమా నిన్న రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తమిళ్ కంటే బెటర్ అండ్ స్టైలిష్ గా సూరీ తెరకెక్కించాడని, చెర్రీ, అరవింద్ స్వామిలు పోటీపడి నటించారని క్రిటిక్స్ ప్రశసంలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా 2000 పైగా థియేటర్లు, ముఖ్యంగా యూఎస్ లో ఎన్నడూ లేని విధంగా 200 ఫ్లస్ స్క్రీన్ లలో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? ఎన్ని రికార్డులు బద్ధలు కొట్టిందో ఇప్పుడు చూద్దాం.

సినిమాపై హైప్ బాగానే ఉన్నప్పటికీ, రీమేక్ కావటంతో కలెక్షన్ల విషయంలో ఘోరంగా దెబ్బపడిందనే అనుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం పన్నెండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక ఎంతో ఆశలు పెట్టుకున్న యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లు అంతంత మాత్రంగానే (2.23 లక్షల డాలర్లు) ఉన్నాయంట. ఈ విషయంలో గత చిత్రం బ్రూస్ లీ (2.85 లక్షల డాలర్లు) సాధించటం విశేషం. సినీ ట్రేడ్ అనాలసిస్ట్ తరుణ్ ఆదర్శ్ 1.51 కోట్లు సాధించిందని తెలిపాడు. అల్రెడీ తమిళ్ సినిమాను కూడా ఓవర్సీస్ లో ఇప్పటికే చాలా మంది చూసేసి ఉండటం మైనస్ అయ్యింది. అయితే సినిమాకు ఎలాగూ పాజిటివ్ టాక్ రావటంతో వీకెండ్ లో మరింత పుంజుకునే అవకాశం ఉందని ఆయన అంటున్నాడు.

ఇక ఈ యేడాది ఇప్పటిదాకా రిలీజైన చిత్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ 20.92 కోట్లు, జనతా గ్యారేజ్ 20.49 కోట్లు, బ్రహ్మోత్సవం 13.06 కోట్లతో టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఫస్ట్ డే విషయం పక్కనబెడితే మరోవారం సినిమాలేవీ లేకపోవటంతో ధృవ మిలియన్ మార్క్ కలే కాదు, కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇక జెమినీ టీవీ 9.5 కోట్లకు ధృవ శాటిలైట్ రైట్స్ కొన్నట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Movie First Day Collections  Dhruva Overseas Collections  

Other Articles