గెట్ రెడీ ఫర్ ధృవ.. అక్కడే చెర్రీ కాంసంట్రేషన్ | Ram Charan Flys US for Dhruva Premier Show

Dhruva run time locked

Ram Charan, Dhruva movie, Dhruva Premier Show, Dhruva Run Time, Cherry Dhruva Movie, Dhruva US premier Show, Ram Charan at Dhruva premier Show, Ram Charan Dhruva Censor, Ram Charan Dhruva Movie, Ram Charan Dhruva US report

Ram Charan Dhruva movie run time Fixed. Two Hours and 39 minutes Action Thiller.

ధ్రువ రన్ టైం లాక్ చేస్కోండి

Posted: 12/07/2016 11:26 AM IST
Dhruva run time locked

మెగా అభిమానులకు ఈ శుక్రవారం పండగ కానుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ధృవ రిలీజ్ కానున్న సందర్భంలో ఇప్పటికే సందడి మొదలైంది. ఓవైపు ప్రమోషన్లు కూడా ఆ రేంజ్ లోనే జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా సినిమా రన్ టైం 2 గంటల 39 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే యూ బై ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సెన్సార్ బోర్డు నుంచి ప్రశంసలు అందాయి. దీంతో చెర్రీకి హిట్ కన్ఫర్మ్ అయినట్లేనని సంబరపడిపోతున్నారు. దానికి తోడు ట్రైలర్ కూడా స్టైలిష్ గా ఉండటం, చెర్రీ సిక్స్ ప్యాక్, మాతృక లో చేసిన అరవింద స్వామియే విలన్ గా చేస్తుండటంతో అంతా పాజిటివ్ బజ్ నెలకొంది. సినమాకు హిట్ టాక్ వచ్చిందంటే చాలూ రెండు వారాలు కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు.

ఇక చిరు 150వ సినిమా ఖైదీ నంబర్ 150లో ఓ సాంగ్ లో స్టెప్పులు వేసిన చెర్రీ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓవర్సీస్ ప్రమోషన్ కోసం యూఎస్ ధృవ ప్రీమియర్ షో కోసం చెర్రీ బయలుదేరబోతున్నాడంట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించగా, స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ సింగ్ చెర్రీకి జోడీగా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Movie Run Time  

Other Articles

Today on Telugu Wishesh