హృతిక్ తో అఖిల్... ఎందుకు కలిశాడు? | Super Star With Budding Star

Hrithik roshan photo with akkineni young hero

Akkineni Akhil, Hrithik Roshan, Hrithik Akhil, Akhil Hrithik, Akhil with Bollywood top hero, Akkineni Akhil latest photo, Hritik Roshan Akhil

Bollywood superstar Hrithik Roshan and Akkineni young hero Akhil posing pic viral.

క్లిక్ చిక్: గ్రీకువీరుడి తో అక్కినేని అఖిల్

Posted: 12/03/2016 11:08 AM IST
Hrithik roshan photo with akkineni young hero

ఈ తరం యువహీరోలకు భాషాబేధం లేకుండా మిగతా హీరోలతో ఫ్రెండ్ షిఫ్ చేయటం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా తొలి సినిమాతోనే అమితాబ్ లాంటి సూపర్ స్టార్ తో ఆశీర్వాదం అందుకున్న అఖిల్ లాంటి వాళ్లకైతే చాలా సులువుగా మారిపోయింది. క్రికెట్ లీగ్ దగ్గరి నుంచి బాలీవుడ్ లో యాడ్ లు చేసే రేంజ్ కి ఎదిగిన అఖిల్ కు అక్కడి పరిచయాలు కూడా ఏం తక్కువ కాదు.

ఇదిగో ఆ చనువుతోనే ఇక్కడ బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ తో ఫోటో దిగేశాడు మన అఖిల్. మొన్న ఓ యాడ్ కోసం మనోడు ముంబయి వెళ్లాడు. ఆ సమయంలో దాదాపు స్టార్లందరినీ కలిసిన ఈ సిసింద్రీ ఇదిగో ఇలా ఫోటోలు దిగేశాడు. అంతేకాదు సంబరంగా ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఒకరు ఇప్పటికే అమ్మాయిల కలల రాకుమారుడిగా స్థిరపడిపోతే, మరోకరు ఆ ట్యాగ్ లైన్ ను అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బావుంది కదా ఈ కాంబో...

అన్నట్లు డిసెంబర్ 9న నిశ్చితార్థం శ్రీయా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్న అఖిల్ ఆ తర్వాత నాలుగు రోజులకే రెండో సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయిపోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  Hritik Roshan  Same Ad  

Other Articles