త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో కష్టమేనా? | Pawan Kalyan wants to do it separately

Pawan trivikram movie delay

Pawan kalyan, Trivikram, pawan trivikram third movie, Pawan Kalyan Katamarayudu, katamarayudu shooting, Pawan Trivikram untitled project, pawan trivikram third movie, pawan Trivikram movie delay

Pawan kalyan not doing Katamarayudu and trivikram untitled project simultaniously.

త్రివిక్రమ్ సినిమా పవన్ చేతులెత్తేశాడా?

Posted: 11/29/2016 04:52 PM IST
Pawan trivikram movie delay

కాటమరాయుడు తర్వాత పవన్ లైన్ లో వరుసగా మూడు సినిమాలు పెట్టాడని తెలిసిన విషయమే. ముందుగా ఏఎం రత్నం, ఆపై త్రివిక్రమ్ సినిమాలకు అఫీషియల్ గా పూజలు మొదలుపెట్టిన పవర్ స్టార్, రెండో దానికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని అల్రడీ డిసైడ్ అయిపోయాడు కూడా. కాటమరాయుడు సెట్స్ మీద ఉండగానే డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు అని కూడా చెప్పుకున్నాం.

అయితే ఆ షెడ్యూలో జస్ట్ మార్పులు జరిగినట్లు అధికారికంగా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు కాకుండా త్రివిక్రమ్ సినిమాను కాస్త టేట్ గా ప్రారంభించాలని లెటెస్ట్ న్యూస్. కాటమరాయుడు షూటింగ్ క్లాష్ కాకుండా సంక్రాంతి కల్లా మొత్తం అయిపోగొట్టేసి, ఆపై చివరి వారంలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడంట. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొనటం చాలా కష్టతరంతో కూడుకున్న వ్యవహారం కాబట్టే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

మరోవైపు నెసన్ దర్శకత్వంలో ఏంఎం రత్నం నిర్మించబోయే సినిమాను(వేదాలం రీమేక్) మాత్రం సమ్మర్ నుంచి(కాటమరాయుడు రిలీజ్ తర్వాత) షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని సూచించాడంట. మొత్తానికి కాటమరాయుడి కోసం ఫిబ్రవరి దాకా షూటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పండక్కే ముగించాలన్న పవన్ ఆలోచన మాత్రం అదిరిపోయిందంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఏది ఏమైనా దసరాకి మాత్రం త్రివిక్రమ్ సినిమా రావటం ఖాయమని ఇప్పటికే చెప్పేశారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  trivikram  untitled project  After Sankranti  

Other Articles