ధనుష్ కి బిగ్ షాక్... మా కొడుకే నంటూ కేసు.. నోటీసులు | Madurai couple claims Dhanush their son

Couple claims dhanush as their son

Dhanush, Melur Couple, Dhanush original parents, Madurai couple, Melur court Dhanush, Rajanikanth son in law, Dhanush real parents, Kasturi raja Dhanush, Dhanush Parents

Dhanush is our son claim Madurai couple, Melur court summons actor

ధనుష్ ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరు?

Posted: 11/26/2016 01:21 PM IST
Couple claims dhanush as their son

కోలీవుడ్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కి పెద్ద షాక్ తగిలింది. మెలూరు మెజిస్ట్రేట్ కోర్టు ఈ స్టార్ హీరోకి సమ్మన్లు జారీ చేసింది. ధనుష్ తమ కొడుకేనంటూ ఓ జంట కోర్టును ఆశ్రయించగా, విచారణ చేపట్టిన కోర్టు నోటీసులు పంపించింది.

మధురై జిల్లా మేలూరు సమీపంలోని మలంపట్టికి చెందిన కదారేశన్(60), మీనాళ్ (55) దంపతులు ఈ పిటిషన్ ను వేశారు. ధనుష్ తమ కుమారుడే అని... అతని ఒరిజినల్ పేరు కలిసెల్వన్ అని, ఇప్పుడు ధనుష్ కే రాజాగా మార్చేసుకున్నాడని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. చిన్నప్పుడు సరిగా చదువుకోవడం లేదని మందలించడంతో... సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు.

Dhanush Childhood photo

ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి డీఎన్ఏ టెస్టులకు కూడా రెడీనే అని వారు చెప్పారు. తమకు నెలకు 65,000 రూపాయలు భరణంగా ఇప్పించాలని వారు కోర్టును కోరారు. తాము చెబుతున్నది నిజం అని నిరూపించడానికి తమ వద్ధ పలు ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో, పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 12న కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ధనుష్ కు సమన్లు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Parents  Melur court  summons  

Other Articles