షారూఖ్, అలియా సినిమా హిట్టే.. కానీ | dear zindagi got positive reviews.

Dear zindagi movie review

Dear Zindagi review, SRK Dear Zindagi, Alia Bhatt Dear Zindagi, Dear Zindagi talk, Dear Zindagi

Dear Zindagi movie got positive reviews.

డియర్ జిందగీకి హిట్ టాక్ కానీ...

Posted: 11/25/2016 04:08 PM IST
Dear zindagi movie review

బాలీవుడ్ లో బాద్ షాకు సరైన హిట్ లేక చాలా ఏళ్లే అయ్యింది. దీంతో సోలో హిట్ ఎప్పుడు కొడతాడా అని అభిమానులు ఎదురుచూశారు. ఈ సమయంలో అలియా భట్ లాంటి కుర్రహీరోయిన్ తో సినిమా అనే సరికి అంతా కంగారు పడ్డారు. కానీ, సినిమాలో తాను గెస్ట్ రోల్ అనే సరికి ఆ హైప్ కాస్త తగ్గింది. మొత్తానికి సినిమా మాత్రం ఈరోజే రిలీజ్ అయ్యింది.

కైరా(అలియా భట్) అనే సినిమాటోగ్రఫర్ కి రెండు సార్లు లవ్ లో బ్రేకప్ అవుతుంది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన కైరా రిలీఫ్ కోసం గోవా వెళ్తుంది. అక్కడ జహంగీర్ అలియాస్ జగ్ (షారూఖ్ ఖాన్) అనే సైకియాట్రిస్ట్ ను కలుస్తుంది. తనకు ఎలాగైనా కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతుంది. అందుకు సరేనన్న షారూఖ్ అలియాకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చాడు. లైఫ్ పై ఎలాంటి ఆశలు పుట్టించాడు అన్నదే సింపుల్ గా స్టోరీ.

ఇంగ్లీష్ వింగ్లీష్ తో శ్రీదేవీకి రీఎంట్రీలో హిట్ ఇచ్చిన గౌరీ షిండే ఈ సినిమాకు డైరక్టర్. సినిమా మొత్తం కలర్ పుల్ గా, జీవితం అంటే ఏంటో తెలియజెప్పే ఓ పాఠంలాగా ఉంటుంది. సినిమాకు ప్రాణం మొత్తం అలియానే. ఉడ్తా పంజాబ్ దగ్గరి నుంచి అలియాలో బాగా మార్పు వచ్చినట్లు ఉంది. ఇంతకు ముందు సినిమాల్లోలాగా చిల్లర పాత్రలు కాకుండా చాలా డిగ్నిటీగా ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. డియర్ జిందగీలో కూడా కైరా పాత్ర అలాగే ఉంటుంది. ఇక మానసికంగా కుంగిపోయిన ఓ యువతికి లైఫ్ వాల్యూ ఏంటో తెలియజెప్పే వైద్యుడి పాత్రలో షారూఖ్ కూడా అద్భుతంగా నటించాడు. ఇగోను పక్కనపెట్టి తన మేనరిజంను మొత్తం మార్చేసుకుని హుందాగా కనిపించాడు.

ఓవరాల్ గా సినిమా బాగుందనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, నారేషన్ కాస్త స్లో ఉండటం, గుర్తుంచుకునే సన్నివేశాలు అంతగా లేకపోవటం సినిమాకు మైనస్ గా మారాయి.  ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవటంతో ఈ డీసెంట్ సినిమా అసలు ఫలితం ఏంటన్నది వీకెండ్ కలెక్షన్లతో తెలిసిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dear Zindagi Movie  Review  Sharukh Khan  Alia Bhatt  

Other Articles