సినిమాల కోసం సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు వేసి రాస్తే, దాన్ని హీరోకి వినిపించడానికి ఓ ఆర్నెల్ల కాలయాపన, ఆపై షూటింగ్ వెరసి ఓ సినిమా కార్యరూపం దాల్చటానికి ఏడాది నుంచి ఏళ్లకు ఏళ్లు పడుతోంది. అదే సమయంలో నిర్మాతల చేత బడ్జెట్ కన్నీళ్లు కూడా పెట్టించడం దర్శకులు చేసే బోనస్ లు. అయితే వర్మ, అతని శిష్యుడు పూరీ మాత్రం అలా కాదు. బడ్జెట్ ఇష్యూ పక్కనబెడితే వారి సినిమాలు రోజుల నుంచి నెలల్లోనే కానిచ్చేస్తుంటారు.
వర్మ సినిమాలైతే మరీ ఘోరం. అసలు ఎప్పుడూ, ఎక్కడ షూటింగ్ అవుతాయో కూడా తెలీకుండా చాపలా చుట్టేసి, ఫస్ట్ లుక్ లు, టీజర్లంటూ షాకుల మీద షాకులు ఇస్తుంటాడు. కానీ, వీరిద్దరినీ మించిపోయే దర్శకుడు ఉన్నాడండోయ్. లెజెండరీ దర్శకుడు బాలచందర్ శిష్యుడు, ఎడిటింగ్ రంగంలో పదిహేనేళ్ల అనుభవం ఉన్న సాల్మన్ కే జార్జ్ డైరక్షన్ డెబ్యూ గా ఓ ప్రయోగాత్మక చిత్రం తీశాడు. అదే కందా(చిన్నారి అని అర్థం).
మొత్తం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం సోనీ ఎఫ్ఎస్ 7 కెమెరాను వాడి జస్ట్ సింగిల్ లోకేషన్ లోనే చిత్రీకరించటం విశేషం. ఓ చిన్నపాప ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ హర్రర్ థ్రిల్లర్ కన్నడలోనే కాదు, సౌత్ లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సినిమాకు ఇంకో బోనస్ ఏంటంటే.. సినిమాలో ఐదు పాత్రలే ఉన్నప్పటికీ, తెరపై ఏడు పాత్రలు ఉన్న భ్రమ కలుగుతుందంటం. అదెలాగో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నాడు సాల్మన్.
గతంలో దొంగల ముఠా సినిమా కోసం వర్మ ఇదే రీతిలో ఓ కెమెరాను వాడి కేవలం వారం లోపే సినిమాను కేవలం ఐదు రోజుల్లో, కేవలం ఎనిమిది మంది క్ర్యూ మెంబర్స్‌తో దిగ్విజయంగా పూర్తి చేయగా, ఇప్పుడు కందా కోసం కేవలం 5 గురితోనే కానిచ్చి రికార్డు క్రియేట్ చేశాడు. కాకపోతే సినిమా కోసం 25 రోజులు సభ్యులంతా రిహార్సల్స్ మాత్రం చేశారంట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more