ఈ ఎడ్డి తంబి నెల సంపాదన ఎంతో తెలుసా? | Bithiri Sathi remuneration details

Intresting facts behind bithiri sathi

Bithiri Sathi salary, Bithiri Sathi behind story, Bithiri Sathi personal details, Bithiri Sathi story, Bithiri Sathi sensation, Teenmar news anchors details, Teenmar news bithiri sathi, Bithiri Sathi real name ravi, Chevella Ravi, V6 news Bithiri Sathi

Intresting facts about Television sensation Bithiri Sathi and his remuneration.

టీవీ సెన్సేషన్ గురించి షాకింగ్ విషయాలు...

Posted: 11/05/2016 03:39 PM IST
Intresting facts behind bithiri sathi

చెవెళ్ల రవి ఇలా అంటే ఎవరికి తెలుస్తుంది. బిత్తరి సత్తి. ఆ ఇప్పడు లైట్ వెలిగింది కదా. ఓ ప్రముఖ ఛానెల్ లో వచ్చే తీన్మార్ వార్తల ద్వారా ఇతగాడు బాగా ఫేమస్. సాఫిత్రక్కా అంటూ తెలంగాణ యాసలో ఇతగాడు చేసే విన్యాసాలను చూసేందుకు తెలుగు ప్రజలను చాలా ఆసక్తి చూపుతుంటారు.

లోడాస్ లాగు, పూల చొక్కా, అరగుండు, ఎర్రి సూపులు, డిఫరెంట్ ఆటిట్యూడ్ ఇది బిత్తిరి సత్తి స్పెషాలిటీ. ప్రతిరోజు జరిగే బర్నింగ్ టాపిక్ ని తీసుకుని తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో పంచ్‌లు విసురుతూపెద్ద సెలబ్రిటీ అయిపోయాడు బిత్తిరిసత్తి. అయితే మొదట్లో చానల్ ఉద్యోగం దొరికితే చాలు అనుకున్న బిత్తిరి సత్తి చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో అవమానాలు, ఛీత్కారాలు కూడా ఎదుర్కున్నాడంట పాపం. ఆపై జీ తెలుగు ఛానల్ లో కామెడీ క్లబ్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ షో సక్సెస్ కావడంతో అతనికి వీ6 ఛానెల్ ఆహ్వానం పలికింది.

అంతే ఇక అప్పటి నుంచి తీన్మార్ వార్తలకు విపరీతమైన పాపులారిటీ రావటమే కాదు, తన చేష్టల ద్వారా ఛానల్‌కి కాసుల వర్షం కురిపించడంతో బిత్తిరిసత్తి చాలా కష్టపడ్డాడు. మరి అతగాని ప్రతిభకు ఛానెల్ యాజమాన్యం కూడా కృతజ్నత చూపాలి కదా. అందుకే నెలకు అతనికి భారీగానే జీతం ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. అదెంతో తెలుసా అక్షరాల లక్షా ముప్పై వేలు అని సమాచారం. ఆ లెక్కన ఈ బిత్తిరోడు లక్షాధికారి అన్నమాట. కాస్త అందంచందాలు ఉన్న మేల్ యాంకర్లు కూడా బుల్లితెరనుండి వెండితెరకు ప్రమోట్ అయిపోతున్నారు. వారిలా కాకుండా వారికి మించిన క్రేజును సంపాదించేసుకుంటున్నాడు ఈ యాంకర్.

రాత్రి తొమ్మిదిన్నర అయ్యిందంటే చాలూ.. ఢంఢ ఢక్కర.. ఢంఢ ఢక్కర... అంటూ మోగే తీన్మార్ వార్తల కోసం యావత్ తెలంగాణ పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుంటుంది. అయితే ఆ సూపులు నీకోసమే అని నీక్కూడా తెలుసు తంబి. సావిత్రక్కతో నువ్వు సేసే రాజకీయాలు, ఆపై సినిమోళ్లను కూడా వదలకుండా నువ్వు యేసే సెటైర్లు అబ్బో... ఆ మాటల సిత్రంకే కడుపు నిండిపోతుంది. సిగ్గిడిసిన సినిమా జోకుల నుంచి ఊరట కలిగిస్తూ తెలుగు ప్రజలు ఇప్పుడు నీతోనే సేదతీరుతాండ్రు. పేరుకే నువ్వు బిత్తిరోడివి గానీ.. జనమంతా.. అబ్బో ఈ తంబికి తెలీని ఇషయం అంటూ లేదు లంగగాడూ అంటూ నిన్ను మెచ్చుకుంటంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bithiri Sathi  real story  remuneration  V6 news  

Other Articles