ధ్రువ సాంగ్ టీజర్ : 10 సెకన్లు... 6 మూమెంట్లు | Ram Charan rocks with neethone song teaser

Druva song teaser hasghtag in number one

Ram Charan Dhruva Movie, Dhruva song teaser, Neethone Song teaser, dhruvasongteaser

Ram Charan Dhruva Movie Neethone Song teaser released.

టాప్ ప్లేస్ లో ధ్రువ టీజర్

Posted: 11/05/2016 10:59 AM IST
Druva song teaser hasghtag in number one

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ధ్రువ ఆడియో లేకుండా నేరుగా పాటలు వచ్చేస్తాయంటూ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న ఆడియో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు నిర్మాత అల్లు అరవింద్. అయితే ఆడియో రిలీజ్ కాకముందే ఇప్పుడు ధృవలో పాటలను రివీల్ చేసింది ఆదిత్య మ్యూజిక్ సంస్థ.

మాతృక తనిఒరువన్ లో ఐదు పాటలు ఉండగా, తెలుగులో మాత్రం కేవలం 4 పాటలతో మాత్రమే సరిపెట్టారు.  మొదటి పాటగా ధృవ టైటిల్ సాంగ్ వినిపించనుంది. 'ధృవ.. ధృవ' అంటూ సాగే పాటను అమిత్ మిశ్రా పాడగా.. 'చూశా చూశా' అంటూ సాగే సాంగ్ ను పద్మలత - స్నిగ్గీ పాడారు. 'నీతోనే డ్యాన్స్' అనే పాటను మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజ్-నికితా గాంధీలు కలిసి పాడారు. ఈ మూడు పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఇక 'పరేశానురా' అంటూ సాగే పాటను పద్మలత పాడగా యాదగిరి రాశారు.

మెగాపవర్ స్టార్ మూవీలోంచి హై ఎనర్జీ బీట్ ఉన్న ఓ సాంగ్ కు ప్రోమో రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. 'నీతోనే డాన్సునై.. నీతోనే డ్యాన్సునై.. నీతోనే పారిపో రాదా..' అంటూ సాగే పాట హై ఎనర్జిటిక్ గా ఉంది. పదంటే పది సెకన్ల పాటు ఉండే ఈ ప్రోమోలో 6 స్టెప్స్ ను చూపించేశారంటే చరణ్ ఈ పాటలో ఎంత స్పీడ్ గా స్టెప్పులేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సాంగ్ లో రకుల్ కూడా తానేం తక్కువ కాదంటూ గ్లామర్ తోపాటు చిందులేసింది.



మరోవైపు ఈ సాంగ్ ను లాంఛ్ చేశాక.. ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లిస్ట్ లో #dhruvasongteaser హ్యాష్ టాగ్ ఏడవ స్థానంలో నిలిచింది. ధృవ ఆడియోపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉండగా.. దీనికి ఏ మాత్రం తగ్గకుండా మ్యూజిక్ ఇచ్చినట్లు.. అందుకు చెర్రీ డాన్సులతో ఇరగదీసినట్లు నీతోనే డ్యాన్స్ సాంగ్ ప్రోమో ప్రూవ్ చేస్తోంది. 'చూశా చూశా' అంటూ సాగేమరో సాంగ్ ను కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Song  Teaser  released  

Other Articles