అఖిల్ పెళ్లికి వేదిక... నాగ్ చెప్పాడా? | A summer wedding in Italy for Akkineni Akhil

A summer wedding in italy for akkineni akhil

Italy venue for Akkineni's wedding, Akhil marriage venue fixed, nagarjuna on akhil wedding, Nag announced akhil wedding, Akhil wedding venue Italy, Akkineni Akhil Marriage, Akhil venue

A summer wedding in Italy for Akkineni Akhil and Shriya Bhupal.

నాగ్ పెళ్లి అనౌన్స్ మెంట్ చేశాడా?

Posted: 11/01/2016 02:22 PM IST
A summer wedding in italy for akkineni akhil

అక్కినేని బాజాలు ఖాయం కావటంతో ఆ సందడి ఎప్పుడు ఉండబోతుందా అని సినీ వర్గాలు, టాలీవుడ్ ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. పెద్ద కొడుకు చైతూది వచ్చే ఏడాదంటూ సస్పెన్స్ పెట్టినప్పటికీ, చిన్న కొడుకు అఖిల్ కి మాత్రం ఈ ఏడాదే అన్న సంకేతాలు ఇచ్చాడు. మరి ఏడాది ముగింపు దగ్గరికి వస్తోంది. ఇక పెళ్లెప్పుడు మరి?

అయితే అఖిల్ - శ్రియాభూపాల్‌ల మ్యారేజ్ హంగామా మొదలైందన్న సంకేతాలు అందుతున్నాయి. వీరి ప్రేమాయణానికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఇటలీలో అట్టహాసంగా జరుగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

వచ్చేఏడాది సమ్మర్‌లో మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తున్నాయి. మనదేశంలో అఖిల్ పెళ్ళి వేడుకను నిర్వహించాలని నాగ్ ఫ్యామిలీ భావిస్తుంటే.. ఘనంగా చేయాలన్నది భూపాల్ ఫ్యామిలీ భావిస్తోంది. అందుకే యూరప్‌లోని ఇటలీ రాజధాని రోమ్ అయితే అఖిల్ వెడ్డింగ్‌కు బాగుంటుందని సమాచారం. మరి ఈ విషయంలో కూడా నాగ్ ప్రకటన చేసే దాకా ఆగటమే బెటర్ ఏమో! ఇంకోవైపు రెండు సాంప్రదాయాలబద్ధంగా వివాహం చేసుకోవాలని చైతూ, సమంతలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు.

ఈ విషయమై ఇరు కుటుంబాలు చర్చల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. రోమ్‌లో అఖిల్ మ్యారేజ్ ఉంటే మాత్రం దాదాపు 500 మందికిపైగానే అతిథులు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. మరి నాగ్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  Wedding  Shriya Bhupal  Italy  2017 summer  

Other Articles