దువ్వాడ జగన్నాథంకి ఏమైంది? | Duvvada Jagannadham Regular shooting starts from

Duvvada jagannadham regular shooting date

Duvvada Jagannadham Regular shooting, DJ regular Shooting, Bunny DJ Movie Updates, Allu Arjun Duvvada Jagannadham, Duvvada Jagannadham telugu movie, Duvvada Jagannadham updates, New Hairstyle of Bunny for DJ movie

Duvvada Jagannadham Regular shooting Date Fixed.

దువ్వాడ జగన్నాథం ఏం చేస్తున్నాడు?

Posted: 10/05/2016 11:50 AM IST
Duvvada jagannadham regular shooting date

టాలీవుడ్ లో వరుస హిట్లతో ఊపు మీద ఉన్న అల్లు వారబ్బాయి దువ్వాడ జగన్నాథంగా ఎన్ని మ్యాజిక్ లు చేస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే డీజేలో పూజా హెగ్డే కథానాయికగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కథా, కథనం అన్ని పూర్తయ్యాయి, అల్రెడీ పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక మిగిలింది రెగ్యులర్ షూటింగే...

తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే... అక్టోబర్ 21 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాన్ స్టాప్ గా చిత్ర షెడ్యూల్స్ పూర్తి చేసి ఏప్రిల్ కల్లా సినిమాను తెచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఫ్లాన్ చేస్తున్నాడంట. ఇందులో బన్నీ డబుల్ రోల్ తోపాటు మరోసారి పోలీస్ పాత్ర పోషించబోతున్నాడని టాక్. అంతేకాదు 8 ప్యాక్ లో కనిపించేందుకు ఫిట్ నెస్ తో సిద్ధమైపోయాడంట.

సినిమా సినిమాకి స్టైల్ లో కొత్తదనం ప్రదర్శించే బన్నీ, ఈ  చిత్రం కోసం అల్రెడీ న్యూ హెయిర్ స్టైల్ ను ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు రచ్చలేపుతున్నాయి. కాగా, ఈ సినిమాలో పూజాహెగ్డే ఏరియల్ స్కిల్స్ (గాల్లో తాళ్ల సాయంతో డాన్సులు) డాన్సర్ గా కనిపించనుందని, అందుకోసం విపరీతంగా ప్రాక్టీస్ చేసిన ఫోటోలు కూడా నెట్ లో దర్శనమిచ్చాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvavda Jagannadam Movie  Allu Arjun  Regular Shooting  

Other Articles