ధోనీ బయోపిక్ కానే కాదు... | MS Dhoni The Untold Story review

Ms dhoni the untold story review

MS Dhoni The Untold Story, MS Dhoni The Untold Story 1st day collections, MS Dhoni The Untold Story got postive reviews, MS Dhoni The Untold Story review, MS Dhoni The Untold Story positives, MS Dhoni The Untold Story Minus, MS Dhoni The Untold Story critics opinion

MS Dhoni The Untold Story got postive reviews.

ధోనీ సినిమా ఇలా అయ్యిందేంటి?

Posted: 10/01/2016 03:33 PM IST
Ms dhoni the untold story review

బాలీవుడ్ లో బయోపిక్ ల ఊపు కొనసాగుతున్న క్రీడా నేపథ్యం ఉన్న స్టార్ల జీవిత చరిత్రల గురించి లోతుగా పరిశీలనలు చేసిన దర్శకులు ఒక్కోక్కటిగా వెలుగులోకి తెస్తున్నారు. ఆ మధ్యలో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర రాగా అది అంతగా వర్కువుట్ కాలేదు. ఇక ఇప్పుడు ది వెడ్ నెస్ డే, స్పెషల్ చబ్బీస్ చిత్రాల దర్శకుడు నీరజ్ పాండే కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ను వెలుగులోకి లోకి తెచ్చాడు. ఇప్పటి తరం వారికి ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? అందుకే అతని జీవితంతలో ప్రీ పిరియడ్ ను ఆన్ టోల్డ్ స్టోరీగా మార్చి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు నీరజ్. క్రికెట్ నుంచి పూర్తిగా నిష్క్రమించక ముందే బయోపిక్ ఏంటని కొందరు సహచరులే హేళన చేశారు. అయినా వాటన్నింటిని లైట్ తీస్కుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఫలితం...   

చిన్నతనం నుంచి క్రికెట్ లోకి ఎలా వచ్చాడు. ఇప్పుడున్న స్థాయికి ఎలా ఎదిగాడు అన్న కోణాలను సృశిస్తూ దాదాపు 190 నిమిషాల పాటు,(3గంటల 10 నిమిషాలు) సినిమాను తెరకెక్కించాడు. సినిమా లెంగ్త్ విషయం ఒక్కటి పక్కన బెడితే ధోనీ సినిమా ఓ అద్భుతం. నిజానికి ఇది ధోనీ సినిమా అని చెప్పుకునేందుకు బదులు... క్రికెట్ కు సంబంధం లేని ఓ కుర్రాడు.. క్రికెట్ ను మతంగా ఎలా మార్చుకున్నాడు అనే విషయాన్ని తెరపై దించేశాడు. సినిమా ఎమోషన్ కంటెంట్ ఒక ఎత్తు అయితే... హీరో సుశాంత్ మరో ఎత్తు. సినిమా చూస్తున్నంత సేపు అరరె ధోనీలా జట్టు పెంచాడే, మహిలా నడుస్తున్నాడే.. ధోనీలా దంచుతున్నాడే అని ప్రతీ ఒక్కరు ఫీలవుతారు. సగం బలం అతనే. మిగతా కాస్ట్ కూడా చాలా నేచురల్ గా ఉంది.

ఒక విజయం వెనుక కఠోర శ్రమ ఉంటుంది. రాత్రికి రాత్రే ఎవరూ స్టార్లు అయిపోరు. మహి జీవితంలో ఇప్పుడున్న పాజిటివ్ కోణాలే అందరికీ తెలుసు. అంతా అదృష్టం అంటూ కామెంట్లు చేసేవారు ఉన్నారు. కానీ, క్రికెటర్ గా ఎదగడానికి అతను ఎంత కష్టపడ్డాడో తెరపై చూపించాడు దర్శకుడు. పుట్ బాల్ టూ క్రికెట్ బాల్.. ఇండియన్ క్రికెట్ టీం ఎంపిక అవ్వటానికి అతడికి ఎదురైన అడ్డంకులు.. కుటుంబ సభ్యులతో మానసిక సంఘర్షణ ఇలాంటి అంశాలన్నింటినీ భావోద్వేగభరితంగా చెప్పడంలో నీరజ్ పాండే ప్రతిభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఫస్టాప్ మొత్తం ధోని బాల్యం.. రైల్వే టీసీ డ్యూటీ, క్రికెటర్ గా మారేందుకు అతను పడే కష్టం ఓ ఎమోషనల్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. ఇక ట్రాజెడీ ప్రేమ కథ గుండెను తాకుతుంది. క్రికెట్ కెరీర్ సాగిన తీరును సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా చూపించారన్న మైనస్ ఉన్నప్పటికీ, మరోసారి ధోనీ హైలెట్స్ చూడాలనుకునేవారికి అవి భలే పసందుగా ఉంటాయి. అంతేందుకు 2011 వాంఖడే మైదానంలో వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ తో సినిమా ముగిసే సమయంలో కూడా రోమాలు నిక్కబోడుచుకుంటాయి.

సాధారణంగా ఇలా బయోపిక్ లు తెరకెక్కించినప్పుడు స్వేచ్ఛ తీసుకుని కొన్ని విషయాలను దాచి మరీ లేనిపోనివి చూపిస్తుంటారు. కానీ, ఈ సినిమా సారీ.. బయోపిక్ విషయంలో మాత్రం ఆ ఛాయలు ఎక్కడా కనిపించవు. అందుకే ధోనీ బయోపిక్ లా కాకుండా ఓ స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగజేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni The Untold Story  Movie  review  

Other Articles