ఫ్రెండ్ సుమంత్ కోసం సూపర్ స్టార్ | Mahesh Babu to launch Sumanth's Naruda DONORuda trailer

Mahesh babu to launch sumanth s naruda donoruda trailer

Mahesh Sumanth, Mahesh Babu Sumanth, Mahesh Babu to launch Sumanth's Naruda DONORuda trailer, mahesh Babu for Naruda DONORuda, Superstar for Akkineni Hero, Sumanth Mahesh Babu, Mahesh Babu released that remake, Mahesh Babu Naruda DONORuda

Mahesh Babu to launch Sumanth's Naruda DONORuda trailer.

డోనరుడి కోసం మహేష్ బాబు

Posted: 09/26/2016 02:48 PM IST
Mahesh babu to launch sumanth s naruda donoruda trailer

ఇన్నేళ్ల కెరీర్ లో అక్కినేని నటవారసుడిగా సక్సెస్ రేటు చాలా తక్కువగా నమోదు చేశాడు సుమంత్. ఆ మధ్యలో చెత్త చెత్త సినిమాలతో విసిగించినప్పటికీ, గత కొన్నేళ్లుగా కాస్త గ్యాప్ ఇస్తూ ఇంట్రస్టింగ్ సబ్జెక్టులతోనే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. గోదావరి తర్వాత గోల్కోండ హై స్కూల్ తో హడావుడి చేసిన సుమంత్ ఇప్పుడు మళ్లీ ఓ బాలీవుడ్ హిట్ రీమేక్ తో పలకరించబోతున్న సంగతి తెలిసిందే.
 
ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్ జంటగా తెరకెక్కి బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ విక్కీ డోనర్ రీమేక్ తెలుగులో రాబోతుంది. సుమంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి సూచనలతో నరుడా.. డోనరుడా అనే టైటిల్ ను ఫిక్స్ చేసేశాడు సుమంత్. మొన్నే మేనమామ నాగార్జునతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించి టాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తించగా, ఇప్పుడు ట్రైలర్ తో సందడి చేయబోతున్నాడు. ఇందుకోసం సూపర్ స్టార్ మహేష్ బాబును వాడుకోబోతున్నాడు.

‘నా ఫ్రెండ్ మహేష్ బాబు చేతుల మీదుగా నరుడా.. డోనరుడా ఎక్స్క్లూజివ్ ఫుల్ లెన్త్ ట్రైలర్ మంగళవారం రిలీజ్ కాబోతోంది..' అంటూ సుమంత్ సోమవారం ట్వీట్ చేశాడు. పోస్టర్స్ సూపర్ ఫన్నీగా కనిపించడంతో మంచి రెస్పాన్స్ రాగా, స్పెర్మ్ డోనేషన్(వీర్యదానం) అనే కాన్సెప్ట్ తో చిత్రం రూపుదిద్దుకుంది. మహేష్ చేతుల మీదుగా రేపు విడుదల కాబోయే కొత్త ట్రైలర్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కాగా, మల్లిక్ రామ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రీమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ పతాకాలపై వై. సుప్రియ, జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. హీరోయిన్‌గా పల్లవి సుభాశ్, ఓ కీలక పాత్రలో తనికెళ్ల భరణి నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Naruda DONARuda Trailer  released  

Other Articles