మధుర గాత్రం ఆగిపోయింది | Veteran Singer Janaki announced retirement

Veteran singer janaki announced retirement

Veteran Singer Janaki announced retirement, Janaki last song, Legendary singer Janaki, Veteran Singer Janaki no more songs, Janaki last song for Meera Jasmine, South Senior Singer retirement

Veteran Singer Janaki announced retirement.

ఆఖరిపాట పాడేసిన సౌత్ నైటింగేల్

Posted: 09/22/2016 05:23 PM IST
Veteran singer janaki announced retirement

ఆమె తెలుగు పాటను తేనెలో ముంచి అందించిన మధురగాయని. పడుచుదనంలో ఉరకలు వేసే అమ్మాయిలకే కాదు, పసి పిల్లలకు, వయసు పైబడిన గొంతులను అనుకరిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. వయసు 78 ఏళ్లు పాడింది 60 ఏళ్లు, మొత్తం 48 వేల పాటలు. సుదీర్ఘ కెరీర్ తో అలసిపోయిన ఆమె ఇక పాటలు పాడలేనంటూ రిటైర్మెంట్ ప్రకటించేసింది. ఆవిడే సౌత్ నైటింగేల్ గా పిలుచుకునే జానకమ్మ.

ప్రస్తుతం అనూప్ మీనన్, మీరా జాస్మిన్ జంటగా మళయాళంలో  '10 కాల్పనికాల్' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో "అమ్మా పూవీను .. " అనే పాటను ఆమె ఆలపించారు. ఎంతో అర్థం ఉన్న ఈ పాట తన కెరీర్ లో ఆఖరిదంటూ ఆమె చెప్పేశారు. ‘ఇకపై నేను ఏ రికార్డింగ్‌ల్లోనూ పాడను. ఇదే నా చివరి పాట. స్టేజ్‌ ప్రోగ్రామ్‌ల్లో కూడా పాడను’ అని ప్రకటించారు జానకమ్మ.
ఇది నిజంగా ఆమె అభిమానులకు బాధను కలిగించే విషయమే.

జానకీ పూర్తి పేరు శిష్‌ట్లా శ్రీరామమూర్తి జానకి. ఏపీలోని గుంటూరు రేపల్లెలో  1938వ సంవత్సరంలో జన్మించింది.  1957లో తమిళ సినిమా ‘విదియిన్‌ విళయాట్టు’తో గాయనిగా రంగప్రవేశం చేశారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, జపనీస్‌, జర్మన్‌, లాటిన్‌, ఉర్దూ, అరబిక్‌.. ఇలా ఎన్నో భాషల్లో ఇప్పటివరకు దాదాపు 48వేల పాటలు పాడారు. వి.రామప్రసాద్‌ను వివాహమాడిన జానకి ప్రస్తుతం తన కొడుకు మురళీ కృష్ణతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు.
 
‘సింధూర పూవె’ (16 వయథినిలే) అనే తమిళ పాటకు గానూ 1977లో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1981లో ‘ఎత్తు మనూరమ్‌ బాలతి’ (ఒప్పోల్‌-మలయాళం), 1984లో వెన్నెల్లో గోదారి అందం (సితార-తెలుగు), 1992లో ‘ఇంజి ఇడుప్పూఝఘ’ (దేవర్‌ మగన్‌-తమిళ్‌) పాటలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇవి కాకుండా 29 పర్యాయాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్నారు. 2013లో ఆమెకు భారత ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మ భూషణ్‌’ అవార్డును ఆమె తిరస్కరించారు. ఆ అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని, దక్షిణాది కళాకారులను గుర్తించడంలో కేంద్రం ప్రదర్శిస్తున్న అలసత్వ వైఖరికి నిరసనగా ఆ అవార్డును తీసుకోలేదు.

దాదాపు ఆరు దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయని ఎస్‌.జానకి. ‘ది నైటింగేల్‌ ఆఫ్‌ సౌత్‌’ అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ గోవుల్లు తెల్లనా, చిన్నారి పొన్నారి కిట్టయ్య అంటూ చిన్న పిల్లల గాత్రంతో చేసిన మ్యాజిక్ చిరకాలం గుర్తుండిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Janaki  Last Song  Retirement  

Other Articles