జిమ్ లో చెమట్లు కక్కుతున్న కాటమరాయుడు | pawan busy in Bangalore Gym For Katamarayudu.

Katamarayudu caught in gym

pawan kalyan in Gym, Katamarayudu caught in Gym, Pawan kalyan workouts, Pawan Kalyan in Gym, Pawan Kalyan katamarayudu updates, Pawan in Gym, Katamarayudu Gym

pawan caught in Bangalore Gym, and busy in workouts For Katamarayudu.

ఫోటో: జిమ్ లో కాటమరాయుడి కుస్తీ

Posted: 09/19/2016 01:58 PM IST
Katamarayudu caught in gym

రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వరుస సభలతో హీట్ పుట్టించి సెగలు రేపిన టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల కోసం సిద్ధమైపోతున్నాడు. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ చిత్రంలో నటించేందుకు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకు సంబంధించిన కొంత పార్ట్‌ షూటింగ్‌ కూడా జరిగి పోయింది.

ఈ నెల 20 నుంచి రెండో షెడ్యూల్ జరగబోతుండగా, 24 నుంచి పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడన్న సంగతి తెలిసిందే. మరి ఈ వారం అంతా పవన్ ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? ఇంకేం చేస్తాడు పిట్ నెస్ కోసం బెంగళూర్ జిమ్ కి చెక్కేశాడు. తన ప్రతి సినిమా మొదలు కావాడానికి కొన్ని రోజుల ముందు బెంగళూరులో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా జిమ్‌ చేస్తాడు. ఎప్పటి నుంచో ఈ ఆనవాయితీ ఉన్నప్పటికీ, సర్దార్ గబ్బర్ సింగ్ టైంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

సుమారు 15 నుండి 20 రోజుల పాటు జిమ్‌ చేసిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తాడు. కెమెరా ముందుకు వచ్చేందుకు పవన్‌ చాలా ఫిట్‌గా తయారు అవుతాడు. కానీ, ఈసారి సమయం తక్కువగా ఉండటంతో ఎక్కువసేపు జిమ్ లోనే గడుపుతున్నాడు. రోజులో దాదాపు ఆరు గంటల పాటు జిమ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతీహాసన్ పవన్ లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Gym  

Other Articles