పవన్ గురించి నేను ఎందుకు మాట్లాడొద్దు? | renu desai slams pawan anti fans

Renu desai slams pawan anti fans

Renu Desai slams Pawan Kalyan Anti fans, renu desai Candid Interview, Renu Desai open up about divorce, Renu Desai slams anti fans, Renu Desai about pawan, Renu Desai about venky and Mahesh, Renu desai twitter interview

Renu Desai slams Pawan Kalyan Anti fans in Exclusive Candid Interview.

యాంటీ ఫ్యాన్స్ కి రేణు గట్టి పంచే ఇచ్చింది

Posted: 09/15/2016 10:53 AM IST
Renu desai slams pawan anti fans

‘ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొచ్చు కానీ, నేను మాత్రం ఎందుకు మాట్లాడకూడదు?’ అని మాజీ భార్య రేణు దేశాయ్ ప్రశ్నిస్తోంది. పవన్ గురించి తాను మాట్లాడుతుండటంపై ట్విట్టర్ ద్వారా కొంతమంది ఆమెను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తనను దూషించే వాళ్లను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చానని... అది మంగళవారం సాయంత్రం ట్విట్టర్లో పోస్ట్ చేస్తానని ముందే చెప్పిన రేణు, అన్నమాట ప్రకారం ఆ వీడియో రిలీజ్ చేసింది.

‘‘నేను పవన్ కళ్యాణ్ ఫొటోలు పోస్ట్ చేస్తే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉంటుందో నాకర్థం కాదు. నాకు పవన్ తో 17 ఏళ్ల స్నేహం ఉంది. అతడి ఇద్దరు పిల్లలకు నేను తల్లిని. మా మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయి. గత ఆరేళ్లుగా తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ పవన్, తాను కలుస్తున్నామని అన్నారు. పవన్ గురించి తాను మాట్లాడకూడదని కొంతమంది ఎందుకు ప్రశ్నిస్తున్నారో తనకు అర్థం కాలేదని పేర్కొంది. చిన్న కారణం వల్ల తాము విడాకులు తీసుకున్నామని, తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పుకోచ్చింది. ఐతే వేరే హీరోల అభిమానులు మాత్రం నేను పబ్లిసిటీ కోసమే ఈ ఫొటోలు పోస్ట్ చేస్తున్నానని దూషిస్తున్నారు’’ అని రేణు పేర్కొంది.

పనిలో పనిగా యాంటీ ఫ్యాన్స్ కు గట్టిగానే రిటార్ట్ ఇచ్చిందామె. హీరోలు స్నేహంగానే మెలిగినా అభిమానులే అవతలి హీరోలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. వారి కుటుంబ సభ్యులపై దూషణకు దిగుతున్నారని రేణు ఆవేదన వ్యక్తం చేసింది.‘‘వెంకటేష్ గారు తరచుగా పవన్ ఇంటికి వచ్చేవారు. మహేష్ ఒకసారి పైరసీ మీద పోరాడుతుంటే పవన్ అండగా నిలిచారు. ఐతే అభిమానుల తీరు వేరుగా ఉంటుంది. వారు తమ హీరోల్ని ఎంతగా అయినా అభిమానించవచ్చు. కానీ వేరే హీరోల కుటుంబ సభ్యుల్ని దూషించడమేంటి? నేను ఎప్పుడు పవన్ ప్రస్తావన తీసుకొచ్చినా నాపై దాడి చేస్తారు. నేను వాళ్లకు తేలికైన లక్ష్యంగా మారిపోయాను. ఇదేం పద్ధతి? ఇలా చేస్తుంటే వాళ్ల వాళ్ల తల్లులు ఎలా ఊరుకుంటున్నారో’’ అని సందేహం వ్యక్తం చేసింది రేణు. మొత్తం తన ఆటిట్యూడ్ పై, పవన్ ఫోటోలు, ట్వీట్లపై పడుతున్న సెటైర్లకు రేణుదేశాయ్ ఇందులో గట్టి సమాధానమే ఇచ్చింది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  Interview  Pawan Kalyan  relationship  anti fans  

Other Articles