రానా-తేజ సినిమా టైటిల్ ఇదే | rana teja movie title fixed as nene raju nene mantri

Rana teja movie title fixed as nene raju nene mantri

rana teja movie title, Rana Nene Raju Nene Mantri, Nene Raju Nene Mantri 2017 movie, Nene Raju Nene Mantri telugu movie, Rana used Mohan Babu title, Teja Rana Movie Updates, Nene Raju Nene Mantri Kajal

rana teja movie title fixed as nene raju nene mantri

రానా కోసం పాత ఫ్లాప్ సినిమా టైటిల్

Posted: 09/14/2016 12:45 PM IST
Rana teja movie title fixed as nene raju nene mantri

బాహుబలి కోసం ప్రభాస్ ఒక్కడే కాదు, రానా కూడా కెరీర్ ను త్యాగం చేశాడనే చెప్పొచ్చు. నాలుగేళ్ల పాటు ఏ కమిట్ మెంట్ ఇవ్వకుండా కసరత్తులు చేసి రూపురేఖలు మొత్తం మార్చేసుకున్నారు. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగులో బిజీగా ఉన్న ఈ హంక్ హీరోలు ఇది ముగియగానే వరుసబెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధమైపోతున్నారు. రానా విషయానికొస్తే బైలింగువల్ ప్రాజెక్టు 'ఘాజీ' తోపాటు, తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

గ్రామ రాజకీయల నేపథ్యంలో సాగే తేజ సినిమా కోసం టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి అన్న టైటిల్ ను తేజ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. 80వ దశకంలో మోహన్ బాబు హీరోగా దర్శకరత్న దాసరి ఇదే టైటిల్ తో ఓ సినిమా తీయగా, అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే పొలిటికల్ టచ్ ఉండటంతో ఈ టైటిల్ కే మొగ్గు చూపారంట.  స్క్రిప్ట్ పవర్ ఫుల్ గా ఉండటంతోనే ఫ్లాప్ డైరక్టర్ గా ముద్రపడినప్పటికీ తేజ డైరక్షన్ పై రానా ఆసక్తికనబరుస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి తేజనే నిర్మాతగా వ్యవహరించనున్నాడు కూడా.

ఇక ఇందులో రానా సరసన కాజల్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. ఘాజీతో పాటే రానా దీని షూటింగ్ లో పాల్గొనబోతున్నాడంట. వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Teja  Nene Raja Nene Mantri Movie  

Other Articles