janatha garage having a terrific run world wide

Janatha garage hits box office collections

janatha garage, jr. NTR, Mohan lal, ntr janata garage, mohan lal janatha garage, telugu states, US, collections, box office collection, Taran Adarsh,

tollywood movie janatha garage staring NTR and mohan lal hits the box office with enormous collections in telugu states and america.

అక్కడ.. ఇక్కడ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జనతా గ్యారేజ్

Posted: 09/04/2016 02:29 PM IST
Janatha garage hits box office collections

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో నటించిన తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ అటు అమెరికాలోనూ ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ బాగా కలెక్షన్లను రాబడుతూ సక్సెస్ పుల్ గా ప్రదర్శింపబుతోంది. చిత్రం విడుదలైన తొలి మూడు రోజుల్లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల  వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ. 60 కోట్ల మార్క్ ను దాటేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. కబాలి, బాహుబలి తర్వాత అత్యధిక ఓపెన్సింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా జనతా గ్యారేజ్ నిలియింది.

గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జనతా గ్యారేజ్’  తొలి రోజే రూ. 41 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో తొలి మూడు రోజుల్లో రూ. 6.34 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రూ. 40 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నాయి సినిమా నిర్మాణ వర్గాలు. లాంగ్ వీకెండ్ ఉండటం వరుసగా సెలవులు కూడా రావటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janatha garage  jr. NTR  Mohan lal  telugu states  US  collections  tollywood  

Other Articles