పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానులు ఏం చేసినా అందులో ఏదో గొప్పదనం దాగివుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముక్కుసూటి తత్త్వం, నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం ఇలాంటి అనేక లక్షణాలు ఆయనను తన అభిమానులకు దగ్గర చేసింది. ఆప్యాయతతో వారి బంధాన్ని మరింత ధృడంగా మలించింది. ఎంతలా అంటే అయన అభిమానులు పవన్ కల్యాన్ ను దేవుడిలా కూడా అభివర్ణించేంతలా. అదే పవర్ స్టార్ కోసం వారు ఏం చేసినా రికార్డులు బద్దులయ్యేలా చేస్తుంది. లేదా రికార్డులను క్రియేట్ చేస్తుంది. పవర్ స్టార్ జన్మదిన సందర్భంగా కూడా అలాంటిదే నమోదయ్యింది.
అదేంటంటారా..? పవన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు ట్విట్టర్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు. భారత్‌లో అతిపెద్ద ట్విట్టర్ ఫ్యాన్ ట్రెండ్‌ను పవన్ ఫ్యాన్స్ సాధించుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్’ అనే ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ మీద గత నెలరోజుల్లో ఏకంగా 5.5 లక్షలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయట. భారత్‌లో ఇప్పటికి ఇదే రికార్డు. ఇప్పటి వరకు ఈ రికార్డు అజిత్ ఫ్యాన్స్ పేరిట ఉండేది. అతని సినిమా ‘ఎన్నై అరిందాల్’ హ్యాష్‌ట్యాగ్‌కు గతంలో 5.3 లక్షల ట్వీట్లు వచ్చాయి. దాన్ని పవన్ ఫ్యాన్స్ దాటేశారు. మొత్తంగా పవన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్ మీద ఆయన ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లు ఆరు లక్షలు దాటే ఆవకాశ ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more