నాగ చైతన్య, అఖిల్ చిత్రాలపై అనౌన్స్ చేసిన నాగ్ | nagarjuna announced Chaithu and Akhil next movies

Nagarjuna announced chaithu and akhil next movies

Nagarjuna announcement in son's issues, Akhil next under Vikram kumar direction, Nagarjuna announced Akhil next, Nagarjuna announced chaitu next, nagarjuna twitter, Nagarjuna key announcement on sons, Nagarjuna sons

Akkineni Nagarjuna announced Naga Chaithanya and Akhil next movies under Kalyan Kumar and Vikram Kumar direction.

చైతూ, అఖిల్ లపై నాగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్

Posted: 09/02/2016 11:09 AM IST
Nagarjuna announced chaithu and akhil next movies

అక్కినేని నటవారసుల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కి తెరవీడింది. తన ట్విట్టర్ వేదిక గా ఈ విషయంపై ఓ స్పష్టత ఇచ్చేశాడు నాగ్. ఆగండి అది సినిమాల విషయంలోనే... తనయులిద్దరి తర్వాతి చిత్రాలు ఎవరితోనే చెప్పేశాడు.  

ఊహించినట్లుగానే పెద్ద కుమారుడు నాగ చైతన్య తదుపరి సినిమా కళ్యాణ్ కృష్ణతో అని చెబుతూ, అఖిల్ చిత్రం విక్రం కుమార్ తో ఉంటుందని అనౌన్స్ చేశాడు. "సెప్టెంబర్ నెల రాకింగ్ అనే చెప్పాలి. నేను పనిచేసిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాను. కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య.. విక్రం కుమార్ తో అఖిల్ సినిమా వుంటాయి. త్వరలోనే ఇవి సెట్స్ కి వెళతాయి" అంటూ ట్వీట్ చేశాడు.  

చైతూ మాటన పక్కనబెట్టి అఖిల్ అక్కినేని నటించే తదుపరి సినిమా విషయంలో మాత్రం సస్పెన్స్ వీడిందనే అనుకోవాలి. అఖిల్ నటించిన తొలిచిత్రం పరాజయం పాలవడంతో, తదుపరి చిత్రం విషయంలో పలు జాగ్రత్తలే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఏ దర్శకుడితో చేయాలన్న విషయమై పెద్ద చర్చలే జరిగాయి. హను రాఘవపూడి పేరు దాదాపు ఖరారైనట్లేనని అంతా అనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో ఊహాగానాలకు తెరదించుతూ 'మనం' ఫేం విక్రంకుమార్ చేతిలో పెట్టేశాడు. కాగా, ఈ రెండు చిత్రాలను నాగ్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Naga Chaithanya  Akhil  Kalyan Kumar  Vikram Kumar  

Other Articles