పవన్ కాటమరాయుడు ఫిక్స్, లోగో విడుదల | Katamarayudu officially fixed for pawan

Sharrath Marar announced pawan titile, pawan officially Katamarayudu, Katamarayudu pawan, pawan Katamarayudu movie, Katamarayudu movie, pawan dolly katamarayudu, katamarayudu logo

Katamarayudu officially fixed for pawan, Sharrath Marar announced in twitter.

పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త

Posted: 09/02/2016 09:44 AM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బర్త్ డే సందర్భంగా హ్యాపీ న్యూస్. కొత్త చిత్రానికి టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. డాలీ దర్శకత్వంలో శృతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కాటమరాయుడు టైటిల్ పరిశీలనలో ఉందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అఫీషియల్ గా ఈ చిత్రానికి దాన్నే ఖరారుచేసేశారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించాడు. మా కాటమరాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, అఫీషియల్ లోగో అంటూ విడుదల చేశాడు. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథ కావడంతో ఈ సినిమాకి 'కడప కింగ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాటమరాయుడు పేరు కూడా వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శరత్ మరార్ ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పారు.

pawan katamarayudu poster

ఇక తన పుట్టినరోజు సందర్భంగా హడావుడి చేయొద్దని పవన్ తన అభిమానులకు సూచించినట్లు తెలుస్తోంది. కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేసుకోవాలని చెప్పాడంట. ఇక సినీ ప్రముఖులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఏకాంతంగా గడపాలనే ఫ్లాన్ చేసుకున్నాడంట.

ఇక ఈ పుట్టినరోజు పవన్ కెరీర్ కే ప్రత్యేకం కానుంది. త్రివిక్రమ్ తో పవన్ సినిమా ఉంటుందని గత కొంత కాలంగా ఓ వార్త షికారు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని కన్ఫర్మ్ చేస్తూ హారికా - హాసిని బ్యానర్ ఓ ప్రకటన వెలువరించింది. కాటమరాయుడు తర్వాత ఇది సెట్ పైకి వెళ్లనుందట. మరో క్రేజీ ప్రాజెక్టు దాసరితో పవన్ సినిమా కూడా అనౌన్స్ చేసేశారు. తన సొంత బ్యానర్ తారకప్రభు ఫిలిమ్స్ పై ప్రొడక్షన్ నెం.38గా పవన్ సినిమా ఉంటుందని స్వయంగా దాసరియే ప్రకటించారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఇది లైన్ లోఉందన్న మాట. ఇలా ఈ పుట్టినరోజు మూడు సినిమాలపై అనౌన్స్ మెంట్ రావటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉండిపోయారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Dolly movie  Katamarayudu  official logo  

Other Articles