దీపికా పదుకునే పై ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ | a question on Deepika Padukone in Indian Air Force entrance exam

Indian air force entrance exam had a question on deepika padukone

A question on Deepika Padukone, Deepika Padukone in Indian Air Force entrance, Deepika Padukone in AFCAT exam, question on Deepika Padukone in Exam, Deepika Padukone filmfare question in airforce exam

A question on Deepika Padukone in Indian Air Force entrance exam.

ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ లో దీపిక గురించి...

Posted: 09/01/2016 01:06 PM IST
Indian air force entrance exam had a question on deepika padukone

ఎగ్జామ్ లలో సినిమాల గురించి ప్రశ్నలు అడిగే స్థాయికి తీసుకెళ్లింది ముమ్మాటీకి బాహుబలే. 2015 తమిళనాడులోని వీట్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రంలో బాహుబలికి సంబంధించిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే అది డిజైన్ ఇంజనీరింగ్ పై కావటం, బాహుబలి సెట్ భారీ సెట్ లు కావటంతో మాములు విషయం అని అంతా అనుకున్నారు.

కానీ, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే గురించి ఏకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ లో ప్రశ్న వేయటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. విషయం ఏంటంటే... ఆగష్టు 28 న ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఎఎఫ్ సీఏటీ పరీక్షలో ఐచ్ఛిక ప్రశ్నల విభాగంలో దీపికకు సంబంధించిన ప్రశ్నను అడిగారు. 2016 గానూ దీపికా పదుకునే ఏ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అందుకుంది అని అందులో అడిగారు, దానికి బాజీ రావ్ మస్తానీ, తమాషా, పీకూ, హ్యాపీ న్యూ ఇయర్ అనే నాలుగు సమాధానాలు కూడా ఇచ్చారు.

ట్విట్టర్ లో ఈ ప్రశ్నకు సంబంధించిన ఫోటోను ఓ యువకుడు షేర్ చేయగా, ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. మరి దీనిపై సొట్టబుగ్గల బ్యూటీ రియాక్షన్ ఏంటో చూడాలి. అన్నట్లు ఆన్సర్ పీకూ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Airforce  Exam  deepika padukone  question  

Other Articles