కన్నడలోకి కుమారి 21 ఎఫ్ | Kumari 21F remake in Kannada, shooting starts.

Kumari 21f kannada remake launched

Kumari 21F Kannada remake, Kannada Kumari 21F hero, Devaraj son Pranam Devaraj, Pranam Devaraj father, Pranam Devaraj Nidhi Kushalappa, Kannada kumari 21 F launch, sukumar with shivaraj kumar

Telugu hit movie Kumari 21F will now be remade in Kannada. Sriman Vemula will be directing this film, which will have Pranam Devaraj, Nidhi Kushalappa as pair.

మన బోల్డ్ సినిమా అక్కడ మొదలైంది

Posted: 08/31/2016 01:20 PM IST
Kumari 21f kannada remake launched

అడల్ట్ కంటెంట్ డోస్ కాస్త ఎక్కువగా ఉంటున్నప్పటికీ యూత్ లో వాటికి ఉన్న క్రేజ్ తో ఇప్పుడొస్తున్న దర్శక నిర్మాతలు మాగ్జిమమ్ వాటికే ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఒక భాషల్లో హిట్ అయ్యిందంటే చాలూ... ఇతర భాషల్లో కూడా వాటిని దించేస్తున్నారు. అలా మన తెలుగు వచ్చిన కుమారి 21ఎఫ్ ఇప్పుడు కన్నడలో రీమేక్ కాబోతుంది.

దర్శకుడు సుకుమార్ కథ,  స్క్రీన్ ప్లేను సమకూర్చడమే కాకుండా, ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమా 'కుమారి 21 F'. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాను శ్రీరామ్ వేముల కన్నడలోకి రీమేక్ చేస్తున్నారు.

తాజాగా బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో నిర్వహించిన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుకుమార్, సూర్యప్రతాప్ లు కూడా హాజరయ్యారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ జ్యోతిని వెలిగించి పూజా కార్యక్రమాలను ఆరంభించగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టాడు. తొలిసన్నివేశానికి సూర్యప్రతాప్ కెమెరా స్విచాన్ చేయగా, సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు దేవరాజ్ (ముద్దమందారం, యజ్నం సినిమాల్లో విలన్) తనయుడు ప్రణవ్ దేవరాజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా, హీరోయిన్ గా నిధి నటిస్తోంది. తెలుగు నుంచి కన్నడలోకి వెళ్లిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయిన దాఖలాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కన్నడ కుమారి కూడా తన సత్తా చాటుతుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F Kannada remake  Kannada  

Other Articles