హైదరాబాద్ లో మహేష్-మురగదాస్ మూవీ | Mahesh-Murugadoss movie shifted to Saradhi studios

Mahesh murugadoss movie shifted to saradhi studios

Mahesh-Murugadoss movie, Mahesh-Murugadoss in Saradhi studios, Mahesh-Murugadoss movie title, Mahesh babu in Saradhi studios

Mahesh-Murugadoss movie shifted to Saradhi studios.

జనతా గ్యారేజ్ స్పాట్ లో మహేష్ బాబు!

Posted: 08/30/2016 03:37 PM IST
Mahesh murugadoss movie shifted to saradhi studios

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురగదాస్ షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు. ఈ మధ్య కాస్త గ్యాప్  దొరికటంతో ఫ్యామిలీతో గడిపిన మహేష్ తిరిగి సెట్ కి రాబోతున్నాడు. చెన్నై లో నైట్ మోడ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది.

ఈ షెడ్యూలో భాగంగా సారథి స్టూడియో లో మహేష్, రకుల్, మరికొందరు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషమేంటంటే... ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కోసం వేసిన సెట్ లోనే మహేష్ చిత్రం షూటింగ్ జరుపుకోవటం, ఓ యాక్షన్ సన్నివేశంతోపాటు, పాటను కూడా ఇక్కడే చిత్రీకరించబోతున్నారంట. గ్యారేజ్ షూటింగ్ అయిపోగానే సెట్ లో చిన్న చిన్న మార్పులు చేసిన ఆర్ట్ డైరక్టర్ దానిని మహేష్ చిత్రం కోసం వాడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బాలీవుడ్ లో తాను దర్శకత్వం వహించిన అకీరా ప్రమోషన్ లో బిజీగా ఉన్న మురగదాస్ ఆ హడావుడి ముగియగానే మహేష్ చిత్రం కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నాడు. దసరాకి ఈ చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జే సూర్య ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  Hyderabad  schedule  

Other Articles