మితిమీరిన అభిమానం మంచిది కాదన్న ఎన్టీఆర్ | Jr NTR Message To Fans After Pawan Kalyana's Fan Death

Jr ntr message to fans after pawan kalyana s fan death

NTR on pawan kalyan fan death, NTR about fans war, Junior NTR on fans, Jr NTR Message To Fans, NTR on pawan fan death, Pawan on NTR fans, NTR pawan fans, Pawan NTR fans

Jr NTR Message To Fans After Pawan Kalyana's Fan Death.

మితిమీరిన అభిమానులు నాకు లేరు: ఎన్టీఆర్

Posted: 08/29/2016 10:19 AM IST
Jr ntr message to fans after pawan kalyana s fan death

తనపై మితిమీరిన అభిమానం చూపించేవారు తన అభిమానులుగా ఉండాల్సిన అవసరం లేదని అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. హీరోలపై వెర్రి అభిమానంతో ఇతర హీరోల ఫ్యాన్స్ తో గొడవలు పడి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరటంపై తారక్ కాస్త సీరియస్ గానే స్పందించాడు. ప్రస్తుతం జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

మితిమీరిన అభిమానం ఎప్పటికీ ఉండకూడదు, నా అభిమానుల్లో అలాంటి వారు లేరనే అనుకుంటున్నా. ఎందుకంటే మొదటి నుంచి నేనుగమనిస్తున్నా కాబట్టి. ఒకవేళ అలా ఉండేవారు తనకు అవసరం లేదు. అభిమానం ముందు దేశం మీద, ఆ తర్వాత తల్లిదండ్రుల మీద, భార్యా పిల్లల మీద, శ్రేయోభిలాషుల మీద ఉండాలి. ఆఖరికి హీరోల మీద చూపించాలి. మా మధ్య(సాటి హీరోలనుద్దేశించి) మితిమీరిన కోపాలు ఒకరిపై ఒకరికి లేవు. ఆ స్థాయికి అభిమానులు కూడా ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు. మా మీద మీకు ప్రేమ ఉండటం చాలా మంచిది, మా అదృష్టం. కానీ, మా మీద ఆఖరి అభిమానం పెంచుకోండి అంటూ అభిమానులకు సూచించాడు.

హీరోలపై అభిమానం తప్పు కాదని, ఆ అభిమానం హద్దులు దాటకూడదని సూచించారు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని చెప్పారు. బాధ్యత గల పౌరులుగా ముందకు మీ కుటుంబం గురించి ఆలోచించండి. గొడవలకు వెళ్లే వారు నా అభిమానులుగా ఉండవద్దన్నారు. కేవలం తాము రెండున్నర గంటలు అలరించడానికే ఉన్నామని, హీరోలే మీ జీవితం కాదని గుర్తుంచుకోవాలని పిలుపనిచ్చాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆయన చెప్పారు. భవిష్యత్తులోనూ హీరోల మధ్య ఎలాంటి గొడవలు ఉండబోవని చెప్పారు. అందువల్ల అభిమానులు జాగ్రత్తగా మెలగాలని సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Message  Fans  other heroes  

Other Articles