చిరంజీవి గురించి మనకు తెలియని విషయాలు | Intresting and Unknown facts about Megastar Chiru

Unknown and intresting facts about megastar chiru

Chiranjeevi 61th Birthday special, Intresting and Unknown facts about Chiru, Chiru birthday special, Chiru Special Article, Chiru International Awards, Chiru unique records, Unkown facts about chiru, Intresting facts about chiru

Megastar Chiranjeevi 61th Birthday special story. Intresting and Unknown facts about Megastar Chiru.

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్....

Posted: 08/22/2016 10:17 AM IST
Unknown and intresting facts about megastar chiru

టాలీవుడ్ చరిత్రలో ‘చిరంజీవి’ అంటే ప‌రిపూర్ణ న‌టుడు అని అర్థం! ఇప్పడొస్తున్న యంగ్ జనరేషన్ హీరోల్లో చాలా మందికి ఆ పేరంటేనే ప్రేరణ. ఫలానా హీరో చిరంజీవి వ‌ల్లే ఎదిగాడు. చిరంజీవిలా డాన్సులు చేస్తున్నాడు. చిరంజీవిలా ఫైటింగులు నేర్చాడు. చిరంజీవిలా స్టైల్ నేర్చుకున్నాడు అనటం పరిపాటిగా మారిపోయింది. ఇలా హీరో పాత్రకే... హీరోయిజాన్ని నేర్పిన వ‌న్ అండ్ ఓన్లీ స్టార్‌... మ‌న మెగాస్టార్ చిరంజీవి.


కొన్ని పాత్రలు న‌టుడి కోసం పుడ‌తాయి.
కొంద‌రు న‌టులు పాత్రల కోసం పుడ‌తారు.


కానీ, ఎప్పుడైతే పాత్రలు న‌టుడి కోసం పురుడు పోసుకోవ‌డం మొద‌లౌతుందో... అప్పుడే ఒక‌ స్టార్ జ‌న్మించినట్టు లెక్క‌. అలాంటి ఆగ‌స్టు 22, 1955లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఓ తార జన్మించింది. ఆ క్షణం... ఆరోజు.. కొణిదెల అంజనా-వెంకట్రావ్ దంపతులు అగ్ర సంతానం జన్మించిందని ఆనందించారు. కానీ, క‌ళామత‌ల్లి మాత్రం ఒక హీరో పుట్టాడు అనుకుని సంబ‌ర‌ప‌డిపోయింది. త‌ల్లిదండ్రులు పెట్టిన‌పేరు శివ శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌. సిల్వర్ స్క్రీన్ చేసిన నామ‌క‌ర‌ణం... చిరంజీవి!
 
చిరంజీవి న‌ట జీవితానికి 1978లో ‘పునాది రాళ్లు’ పడ్డాయి. కొన్నాళ్ల త‌రువాత అభిమానుల హృద‌యాల్లో ‘ఖైదీ’ అయిపోయాడు. ‘హీరో’ అంటే ఇలా ఉండాల‌నే ‘ఛాలెంజ్’తో నిలిచి... వెండితెర ‘గూండా’లా అభిమానాన్ని దోచుకుంటూ పోయాడు. కొద్ది కాలంలోనే తెలుగుతెరకి ‘కొండవీటి రాజా’ అయ్యాడు. న‌ట‌నని న‌ర‌న‌రాల్లో జీర్ణించుకుని, స్టైల్‌ని క‌ణ‌క‌ణానా నింపుకుని న‌ట‌‘రాక్షసుడు’గా అత‌రించాడు. అలుపెర‌గ‌ని ప్ర‌స్థానంలో ‘విజేత’గా నిలిచి... తెలుగు న‌టీన‌టుల గ్యాంగ్‌కి ‘గ్యాంగ్ లీడర్’ అయ్యాడు. తెలుగు సినీ ముఠాకి ‘ముఠామేస్త్రీ’గా ముందున్నాడు. మ‌రో ద‌శకం మారేస‌రికి... చిరంజీవి సినీ ఎవరెస్ట్ గా ఎదిగాడు. త‌రువాతి త‌రం న‌టుల‌కు ద్రోణాచార్యుడిలా ‘మాస్టారు’ అయ్యాడు. హీరోయిజానికి కొత్త అర్థాన్ని నేర్పి ‘ఠాగూర్’గా నిలిచిపోయాడు.

సినిమాలకు అందించిన సేవలకు ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు. ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులతోపాటు, మూడు సార్లు నంది అవార్డులు( ఒకసారి రుద్రవీణకు స్పెషల్ జ్యూరీ) ఆయన్ను వరించాయి. పద్మభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది.  
 
తారలకు వయసుపెరిగినా వెలుగు వెలుగుతూనే ఉంటాయి. మన మెగాస్టార్‌కీ అంతే. రాజకీయ ప్రస్థానంలో అలసిపోయి, మళ్లీ తెరపై వెలిగేందుకు దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీతో రాబోతున్నాడు.  ఇప్పుడు ఆయ‌న‌కి అర‌వ‌యి ఒకటా‌! న‌మ్మొచ్చా...?  కష్టంగా అయినా నమ్మి తీరాల్సిందే. ఇవాళ్ల ఆయ‌న బ‌ర్త్‌డే... అదే అభిమానుల పండ‌గట‌! మ‌రోసారి మీ మెగా మేజిక్ చూసేందుకు కోట్ల అభిమాన గ‌ణం ఎదురుచూస్తోంది. హ్యాపీ బ‌ర్త్ డే చిరంజీవీ!

చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:


* చిరంజీవి ఫెవరెట్ హీరో హాలీవుడ్ నట దిగ్గజం సీన్ కానరీ, నటి సావిత్రి. ఇక తనతో చేసిన హీరోయిన్లలో మాత్రం శ్రీదేవి అంటే చాలా ష్టం. ఆయన దృష్టిలో పర్‌ఫెక్ట్‌ హీరోయిన్‌ అంటే ఆమె. అందంతో పాటుగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అంటూ చిరు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు.

* దక్షిణ చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆస్కార్ అవార్డులకు హాజరయిన మొదటి నటుడు చిరంజీవియే. 1987లో జరిగిన ఆస్కార్ పురస్కారాల వేడుకకు ప్రతినిధిగా ఆయన హాజరయ్యాడు.

* 1990లో చిరు నటించిన కౌబాయ్ చిత్రం కోదమసింహం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కే. మురళి మోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. సౌత్ ఇండియన్ తరపున ఇంగ్లీష్ లోకి డబ్ చేయబడ్డ మొదటి సినిమాగా రికార్డుకెక్కింది. హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరర్ గా ఇది విదేశాల్లోనూ విడుదలయ్యింది. ఇక చిరు నటించిన పసివాడి ప్రాణం, స్వయంకృషి చిత్రాలు కూడా రష్యన్ భాషలోకి తర్జుమా కావటమే కాదు, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కూడా అయ్యాయి.

* చిరు ఫెవరెట్ సాంగ్ ఏంటో తెలుసా? రుద్రవీణలో అన్ని పాటలు. మెలోడీ మాస్ట్రో ఇళయరాజా అందించిన ఆ గీతాలంటే చిరు ఫ్యామిలీ మొత్తానికి ఇప్పటికీ ఆల్ టైం ఫెవరెట్ అంట.

* టాలీవుడ్ లో పదికోట్ల మార్కును టచ్ చేసిన మొదటి చిత్రం ఘరానా మొగుడు. ఈ చిత్రానికి చిరు అందుకున్న పారితోషకం అక్షరాల కోటిన్నర. ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో అప్పటిదాకా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది చిరుయే కావటం విశేషం. తద్వారా అప్పటిదాకా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న అమితాబ్ రికార్డును చిరు చెరిపేశాడు.

* చిరు హాబీ ఫొటోగ్రఫి. చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి ఉన్నప్పటికీ వీలుకాలేదు. కానీ, సినిమాల్లోకి వచ్చాక అదొక హాబీగా మార్చేసుకున్నారంట.

* 59 అకాడమీ వేడుకలకు గౌరవ అతిధిగా హాజరయిన చిరుకు అక్కడ ీఘనసన్మానం జరిగింది.

* 1988 ముందు దాకా చిరును సుప్రీంహీరోగానే పిలిచేవారు. కానీ, మరణ మృదంగం చిత్రం నుంచి టైటిళ్లలో మెగాస్టార్ వేయటం ప్రారంభించారు.

* 1999-2000 సంవత్సరానికి గానూ ఇండియాలో హయ్యెస్ట్ టాక్స్ పేయర్ నటుడిగా చిరు రికార్డు సృష్టించారు. అందుకే ఆర్థిక శాఖ 2002లో ఆయన్ను సమ్మాన్ అవార్డుతో సత్కరించింది.

* ది రిటర్న్ ఆఫ్ ది థిఫ్ ఆఫ్ ది బాగ్దాద్ చిరు నటించిన ఏకైక ఆంగ్ల చిత్రం. కానీ, కొన్ని అనివార్య కారణాలతో ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Megastar Chiranjeevi  61th birthday  special  Intresting and Unknown facts  

Other Articles