తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అన్నట్లుంది ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రమ్య వ్యవహారం. పాకిస్తాన్ అనుకూలంగా అమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి. నటి రమ్య పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో మండ్యలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ పాకిస్తాన్‌కు వెళితే నరకానికి వెళ్లినట్లు అని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్ పేర్కొనడం సరికాదని అన్నారు.
ఇంత వరకు బాగానే వున్నా ఇక్కడే అసలు ట్విస్టు వచ్చింది. అంతటితో అగని రమ్య మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో అక్కడి ప్రజలు కూడా అలాగే నివశిస్తున్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని కితాబిచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్ జనులు తీవ్రంగా స్పందిస్తున్నారు, పాకిస్థాన్‌కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఈ సందర్భంగా ఖండించడంపై విమర్శలు పెల్లుబిక్కాయి,
రమ్య వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో రమ్య ట్విట్టర్లో స్పందించారు. తాను ప్రధాని మోడీని వ్యతిరేకించలేదన్నారు. అయితే, కొన్ని అంశాలలో తాను విభేదించానన్నారు. పాకిస్తాన్‌లో తమలాంటి ప్రముఖులను బాగా చూసుకున్నారని మాత్రమే తాను చెప్పానని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more