రాధికా ఆప్టే విమర్శలను చాలా పాజిటివ్ గా తీసుకుంటుదట | Radhika Apte says I am very good at taking criticism

Radhika apte says i am very good at taking criticism

Radhika Apte response on Nude Videos, Radhika Apte about Nudity, Radhika Apte about critics, Radhika Apte about naked scenes

I am very good at taking criticism Radhika Apte says.

న్యూడ్ సీన్లపై కామెంట్లకు రెస్పాన్స్

Posted: 08/20/2016 05:31 PM IST
Radhika apte says i am very good at taking criticism

నటన అనే ప్రొఫెషన్ లో విమర్శలను ఎంత పాజిటివ్ గా తీసుకుంటే, కెరీర్ లో అంత ముందుకు వెళ్తామని చెబుతోంది నటి రాధికా ఆప్టే. రక్త చరిత్ర', 'షోర్ ఇన్ ది సిటీ', 'ధోని' (తెలుగు సినిమా) చిత్రాలలో సహజమైన నటనను కనబరిచిన రాధికా రీసెంట్ గా ‘కబాలి’లో ఏకంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో జోడీ కట్టి ఆకట్టుకుంది. తరచూ ఈ భామ వీడియోలు నెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నగ్న సన్నివేశాలలో నటించడం, ఆపై వాటిని లీకులు చేస్తూ పాపులర్ అయిపోవటం రాధికకు అలవాటుగా మారిపోయిందని పలువురు సీనియర్ నటులు బహిరంగంగానే కామెంట్లు చేశారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండైరక్ట్ గా స్పందించింది. త‌న‌కు విమర్శలంటేనే ఇష్టమ‌ని, అందుకే వాటిని ఆనందంగా స్వీక‌రిస్తాన‌ని తెలిపింది.

త‌నకు తెలిసినంత వరకు త‌న‌పై ప్రతీఒక్కరూ విమర్శలు గుప్పించేవాళ్లేన‌ని, వారిలో కొందరి మాటలనే తాను పట్టించుకుంటానని రాధికా ఆప్టే పేర్కొంది. తప్పులను ఎత్తిచూపుతూ త‌న‌పై చేసే విమర్శలకే తాను ప్రాధాన్యమిస్తాన‌ని తెలిపింది. వారి విమర్శలను ఎనర్జీగా స్వీకరించి ముందుకు వెళ్తానే తప్ప, వెనక్కి తిరిగి చూసుకోనంటూ చెబుతోంది. సినీప‌రిశ్రమ‌లో తనపై విమర్శలు, పుకార్లు వచ్చినప్పుడల్లా ధైర్యం చెప్పే ఫ్రెండ్స్ తనకు ఉన్నారని, అలాంటప్పుడు ఏ కొందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చురకలు అంటించింది. ప్రస్తుతం ధనుష్ తో నటించబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు చెప్పిందీ పుణే బ్యూటీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Nude Videos  criticism  

Other Articles