ఎంగేజ్ మెంట్ ఉత్త పుకార్లే అంటున్న సోనాక్షి సిన్హా | Sonakshi denies engagement rumours with Bunty Sachdev

Sonakshi sinha denies engagement rumours with bunty sachdev

Sonakshi Sinha denies engagement rumours, Sonakshi Sinha beau, Sonakshi Sinha Bunty Sachdev, Bunty Sachdev girl friend, who is Bunty Sachdev, Bunty Sachdev fke news, Bunty Sachdev, Sonakshi Sinha Rumours

Sonakshi Sinha denies engagement rumours with Bunty Sachdev.

ఎంగేజ్ మెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది

Posted: 08/12/2016 01:41 PM IST
Sonakshi sinha denies engagement rumours with bunty sachdev

బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ముద్దుల తనయ సోనాక్షి సిన్హాకు సినిమాల సంగతి ఏమోగానీ, రూమర్ల విషయంలో మాత్రం చాలా ముందుంది. ఈ నేపథ్యంలోనే ఆమె బంటీ సచ్ దేవ్ తో ప్రేమాయణం నడుపుతుందని, చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేకపోవటంతో త్వరలోనే నిశ్చితార్థానికి సిద్ధమైందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనీ, పెళ్లి చేసుకుందామని అతను అనడంతో సోనాక్షీ కూడా ఓకే చెప్పేసిందని అనుకుంటున్నారు. త్వరలోనే నిశ్చితార్థమని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారంటూ కొన్ని పత్రికలు ప్రముఖంగా రాసేస్తున్నాయి. మొదట్లో పట్టిచుకోకపోయినప్పటికీ రాను రాను  ఈ ప్రచారం ముదిరిపోతుండటంతో  సోనాక్షీ స్పందించింది. 'నా కుటుంబం స్నేహితులకు నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్స్. కానీ అది కరెక్ట్ కాదు. ఇంకా మీరు అవే రాస్కుంటూ ఉంటే కనుక.. అవన్నీ వెంటనే ఆపెయ్యండి' అంటూ ఓ ప్రముఖ పత్రికకు నేరుగా చురకలంటించింది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది మురగదాస్ డైరక్షన్ లో వచ్చిన అకీరా. తమిళ హిట్ చిత్రం మౌనగురు రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సోనాక్షి ఈ చిత్ర ప్రమోషన్ లో బిజీగా గడిపేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  Engagement  secret Engagement  fake news  

Other Articles