పెళ్లిళ్లో సమంత అలాంటి పనులు చేసిందట | Samantha Worked in weddings for pocket money

Samantha worked 3 hours for 1000 rupees in weddings

Samantha Ruth Prabhu worked in weddings, Samantha for pocket money, Samantha early life, samantha school days, samantha affair

Samantha Ruth Prabhu worked in weddings for pocket money early days.

డబ్బు కోసం చాలా పనులు చేశా!

Posted: 08/09/2016 06:08 PM IST
Samantha worked 3 hours for 1000 rupees in weddings

సినిమాల సంగతి పూర్తిగా పక్కనబెడుతున్న సౌత్ డాల్ సమంత ప్రస్తుతం ట్వీట్లతోనే కాలం గడిపేస్తుంది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతుంది కదా ఇక ఇంటి వంట పని నేర్చుకోవటంలో తలమునకలై పోయింది. మధ్యలో హాలీడే ట్రిపులకు ఫారిన్ వెళ్తూ అక్కడ కూడా హాట్ షోలతో అదరగొడుతుంది. అంతేకాదు చిన్నప్పటి నుంచి సంగతులను గుర్తు చేసుకుంటూ వేదాంత ధోరణిలో మాట్లాడేస్తుంది.

ఆ మధ్య స్కూల్ మార్క్ షీట్లను పెట్టి తానో తోపు స్టూడెంట్ నని సొంత డబ్బా కోట్టుకున్న సమంత డబ్బు కోసం తండ్రి కోసం చేయి చాచకుండా ఎలా సంపాదించేదో చెప్పుకోచ్చింది. తనకు పద్నాలుగేళ్ల వయసు రాగానే అవసరాల కోసం ఏదో ఒక పనిచేసి అంతో ఇంతో సంపాదించుకునేదంట. "డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చాలా చేసేదాన్ని. నాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు పెళ్లిళ్లలో రిసెప్షన్ దగ్గర కూడా పనిచేసేదానిని. అతిథులను ఆహ్వానిస్తూ పన్నీరు జల్లే ముగ్గురు, నలుగురు అమ్మాయిల్లో ఒకరిగా నిలబడేదానిని. అలా మూడు గంటల పాటు చిర్నవ్వు చిందిస్తూ... కష్టపడి నిలబడితే వెయ్యి రూపాయలు వచ్చేవి.

అలా పనిచేయడానికి నేను ఏమాత్రం సిగ్గుపడేదానిని కాదు. కష్టపడి సంపాదించుకుంటున్నానని గర్వంగా వుండేది. ఆ వెయ్యి రూపాయలను ఎంతో మురిపెంగా దాచుకునే దానిని. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న ఆ కిక్కు మాత్రం రావడం లేదు" అంటూ చెప్పుకొచ్చింది సమంత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha Ruth Prabhu  pocket money  wedding  works  

Other Articles