వైజాగ్ లో మంచు మనోజ్ నిర్మాతపై దాడి | Junior Artists Attack On Manchu Manoj Producer

Junior artists attack on manchu manoj producer

Manchu Manoj Vizag shooting, Junior Artists Attack On producer, Manchu Manoj about producer attack, Manchu Manoj producer attack, producer attacked, producer Achi babu attack

Junior Artists Attack On Manchu Manoj Producer.

మంచు మనోజ్ నిర్మాతపై దాడి... తప్పెవరిది?

Posted: 08/02/2016 03:09 PM IST
Junior artists attack on manchu manoj producer

టాలీవుడ్ లో కాసేపటి క్రితం పెనుదుమారం రేగింది. విశాఖ పట్నంలో ఓ షూటింగ్ చిత్రీకరణ సందర్భంగా ఓ సినీ నిర్మాత జూనియర్ ఆర్టిస్టులు దాడికి తెగబడ్డారన్న వార్త షాక్ కి గురిచేసింది. మంచు మనోజ్ హీరోగా ప్రస్తుతం ఓ చిత్ర షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే తాగిన మైకంలో సెట్ లోకి వచ్చిన కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఆ చిత్ర నిర్మాత అచ్చిబాబును వ్యాన్ నుంచి కిందకు లాడి ఇష్టారాజ్యంగా దాడి చేశారంట. ఈ ఘటనతో బిత్తరపోయిన మంచు మనోజ్ తోపాటు యూనిట్ మొత్తం పరవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

చిత్రం షూటింగ్ లో స్థానికులకు అవకాశం కల్పించలేదన్న కారణంగానే జూనియర్ ఆర్టిస్టులు ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఈ దాడిని మంచు మనోజ్ తీవ్రంగా ఖండించాడు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జూనియర్ ఆర్టిస్టుల వైఖరిపై నిప్పులు చెరిగారు. టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదు కేంద్రంగానే చిత్ర నిర్మాణం జరుగుతున్నా... విశాఖలో షూటింగ్ అంటే హుషారుగా కదిలివస్తున్న తాము ఈ దాడి నేపథ్యంలో ఇక్కడికి రావాలంటేనే జడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఫెడరేషన్ కార్డులు లేని జూనియర్ ఆర్టిస్టులే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారుు. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపి నిందితులపై చర్యలు తీసుకోవాలని, అప్పటి దాకా షూటింగ్ నిలిపివేస్తున్నట్లు మంచు మనోజ్ ప్రకటించాడు.   ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.

అయితే మనోజ్ చేసిన ఆరోపణలను జూనియర్ ఆర్టిస్టులు ఖండించారు. తాము అచ్చిబాబుపై ఎలాంటి దాడికి పాల్పడలేదని తెలిపారు. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించమని మాత్రమే అడిగామని వారంటున్నారు. పలువురికి జీవనోపాధి కల్పిస్తున్న మనోజ్ లాంటి హీరోలు ఈ రకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేయడం తమను ఆవేదనకు గురి చేస్తోందని వారు చెప్పారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Vizag  shooting  Junior Artists  Attack  producer  Achi Babu  

Other Articles