Allu Arjun To Float A Nightclub in Hyderabad

Bunny to venture into hospitality business

Allu Arjun to venture into hospitality business, bunny to float night club, allu arjun Night Club, allus night club Hyderabad, allu arjun business, allu arjun, Tollywood, Sarrainodu, Allu Aravind

Stylish Star Allu Arjun has also decided to join the list of Tollywood celebs who ventured into hospitality business. Bunny is all set to float an upscale nightclub Hyderabad. The nightclub will be launched on July 29.

హాస్పటాలిటీ రంగంలోకి అడుగిడనున్న బన్ని

Posted: 07/25/2016 07:46 PM IST
Bunny to venture into hospitality business

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్ల అర్జున్ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టబోతున్నారా..? అందులోనూ తన నటనతో ఇప్పటికే కుర్రకారు నుంచి యంగ్ గార్ల్స్ వరకు తన అభిమానులుగా మలుచుకున్న బన్ని.. త్వరలోనే వారితో ముడిపడిన వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారా.? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. సినీరంగ ప్రవేశం చేసిన సెలబ్రిటీలుగా స్థిరపడిన అనేకమంది ప్రముఖులు ఇప్పటికే వివిధ వ్యాపారాలలో రాణిస్తున్నారు, వారిని స్పూర్తిగా తీసుకుని బన్నీ కూడా త్వరలోనే వ్యాపారాన్ని ప్రారంభించనున్నాడు.

తన 13 ఏళ్ల సినీకెరీర్ లో ఎన్నడూ అటు వైపు అలోచించని బన్ని.. తాజాగా మాత్రం హాస్పటాలిటీ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకుగానే ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్న అర్యా.. హైదరాబాద్ లో డాన్సింగ్ క్లబ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఓ అంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం బన్నీ ఇప్పటికే అందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే.. ఈ నెల 29నే నైట్ క్లబ్ ప్రారంభం కూడా కాబోతుందని సమాచారం.

ఇందుకోసం అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పోందిన బ్రాండ్ ఎం కిచన్ సహా హైలైఫ్ బ్రెవరీ కంపెనీతో కూడా బన్నీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ విషయాలు వెల్లడవ్వడంతో ఆయన వ్యాపార రంగంలోకి ఎంట్రీ రమారమి ఖరారైనట్టు సమాచారం. సంపన్నులతో పాటు హైటెక్ సిటీ టాప్ ఉద్యోగులకు కూడా ఇది వారంతపు విడిది కానుంది.  అయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో క్లబ్బింగ్ లేకపోడంతో తనకు ఈ అలోచన వచ్చిందిని.. తన నైట్ క్లబ్ తో హైదరాబాదీయులకు త్వరలోనే నైట్ క్లబ్ అనుభవం అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా అల్లు అర్జున్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Night Club  Hyderabad  Tollywood  Sarrainodu  Allu Aravind  

Other Articles