బీ గ్రేడ్ నటి సిరిప్రియ ప్రేమపెళ్లికి చిక్కులు | romantic short films actress siripriya love marriage in trouble

Romantic short films actress siripriya love marriage in trouble

romantic short films actress, actress siripriya love marriage, actress siripriya husband Prasanna Kumar, B grade actress marriage in trouble, telugu short film actress marriage in trouble, actress in Rajanagaram Police Station.

romantic short films actress siripriya aka chandrakala love marriage in trouble. Siripriya husband Prasanna Kumar Parents objected.

బీ గ్రేడ్ నటి పెళ్లికి చిక్కులు

Posted: 07/19/2016 05:38 PM IST
Romantic short films actress siripriya love marriage in trouble

సినిమాల్లో నటించేవారు అంతా మంచి వాళ్లే ఉండరు... అలాగని ఉన్న వాళ్లంతా తప్పులు చేస్తూ బతకరు. అయినా సినిమా వాళ్లంటే ఓ చిన్నచూపు ఉంటుంది. వ్యాంప్ టైప్ పాత్రలతో పాపులర్ అయిన వారి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించే ఓ నటి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది.

సిరిప్రియ(చంద్రకళ) అనే నటి ఎక్కువగా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించి బాగా పాపులర్ అయ్యింది. త్వరలో ఆమె నటించిన ఆమె కోరిక అనే చిత్రం విడుదల కానుంది కూడా. కాగా, గత ఆరేళ్లుగా సామర్లకోటకు చెందిన ప్రసన్న కుమార్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. గత వారం వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి ప్రేమ వివాహానికి పెద్దలు అభ్యంతరం చెప్పటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తాను బతకడం కోసమే అలాంటి సినిమాల్లో నటిస్తున్నానే తప్ప, తప్పు చేయటం లేదని ఆమె వాదిస్తోంది. సినిమాల్లో ఉండే వాళ్లంతా తప్పులు చేస్తూ బతకరు.. అలాగని అంతా మంచివాళ్లే ఉండరని ఆమె చెబుతోంది.  

ప్రసన్న కుమార్ కుటుంబానికి తనను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేకపోతే, అతన్ని తనలో పంపేయాలని, తామిద్దరం వేరుగా బతుకుతామని కోరుతోంది. కాగా, ప్రసన్నకుమార్ పై మిస్సింగ్ కేసు సామర్లకోట పోలీస్ స్టేషన్ లో నమోదై ఉండడంతో రెండు రోజుల క్రితం అతనిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ప్రసన్న కుమార్ కూడా ప్రేమ వివాహం చేసుకున్న భార్యతో కలిసి జీవించేందుకు మొగ్గు చూపుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం అభ్యంతరం చెబుతున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles