హృతిక్ మోసం చేశాడంటున్న హీరోయిన్ | Pooja Hegde cheated by hritik roshan

Pooja hegde cheated by hritik roshan

Pooja Hegde eats piece of chalk, Pooja Hegde cheated by Hritik Roshan, Hritik Roshan cheated Pooja Hegde, Mohenjo Daro sets, Mohenjo Daro funny moments

Pooja Hegde explained how she cheated by Hritik Roshan in Mohenjo Daro sets.

హృతిక్ మోసం చేశాడంటున్న హీరోయిన్

Posted: 07/18/2016 09:53 AM IST
Pooja hegde cheated by hritik roshan

బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తనను మోసగించాడని చెబుతోంది నటి పూజా హెగ్డే. మొహంజోదారో షూటింగ్ సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరు సినిమా ప్రమోషన్లో భాగంగా దేశం మొత్తం చుట్టేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న తమ షూటింగ్ అనుభవాలను పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే హృతిక్ తనను ఎలా మోసం చేశాడని ఓ ఘటనను వివరించింది పూజా.

సాధారణంగా షూటింగ్ స్పాట్ లో ప్రాక్టికల్ జోకులు వేస్తూ అందరినీ ఆటపట్టించే హృతిక్ దెబ్బకి తాను కూడా బలయ్యానని చెబుతోంది. డైట్ గురించి అడిగిన తనకు ఓ రోజు ఓ తెల్లని పదార్థం తెచ్చి అది ప్రొటీన్ బార్ అని, దీన్ని తింటే శరీరానికి శక్తి వస్తుందని చెప్పాడట. అనుమానం వచ్చి ప్రశ్నిస్తే, "ఆరోగ్యాన్ని ఇచ్చే వేవీ ఆకర్షణీయంగా ఉండవు. చేటు చేసేవే నోరూరిస్తూ కమ్మగా ఉంటాయి. ప్రొటీన్ బార్ రుచిగా ఉండదులే" అని నమ్మించాడట.

కండలవీరుడి మాటలను నమ్మి ఆ సుద్ద ముక్కను తినేసిందట. ఆపై అసలు విషయం తెలుసుకుని బుంగమూతి పెట్టిందని చెబుతోంది. తమాషా తనకు నచ్చిందని చెబుతూనే, తాను అమాయకంగా ఎలా మోసపోయిందీ వెల్లడిస్తోందీ అందాల ముద్దుగుమ్మ.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohenjo Daro  Hritik Roshan  cheat  Pooja Hegde  piece of chalk  

Other Articles