చైతూకి సమంత సరైన జోడీ కాదా? | samantha not in Naga Chaitanya's Kalyanam

Samantha not in naga chaitanya s kalyanam

samantha in kalyanam, Rakul replace samantha for Kalyanam, Naga Chaitanya Kalyanam with

Samantha exit from Naga Chaitanya kalyanam. Rakul Preet Singh replaced.

చైతూకి సమంత సరైన జోడీ కాదా?

Posted: 07/14/2016 03:04 PM IST
Samantha not in naga chaitanya s kalyanam

చైతూ .. సమంతల ప్రేమ వ్యవహారం హల్ చల్ చేస్తోన్న సమయంలో, ఆమె సినిమాలకు పుల్ స్టాప్ పెట్టిందనే వార్తతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలను ఆమె వదిలేసుకుంది. ఇచ్చిన అడ్వాన్స్ చెక్కులను కూడా తిరిగి ఇచ్చేసింది. గరిటె పట్టానని, ఇంటి పని నేర్చుకుంటున్నానని రోజుకో ట్వీట్ చేసి సంబర పడిపోతుంది. అయితే ఈలోగా నాగ్ ఆమెకు అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు.

నాగచైతన్య -సమంత కాంబినేషన్లో కళ్యాణం అనే సినిమా రాబోతుందని, బహుశా ఇదే సమంతకు ఆఖరి సినిమా అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సోగ్గాడే చిన్నినాయన' సినిమాతో నాగార్జునకు బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఆ చిత్రానికి దర్శకత్వవం వహిస్తాడని అనౌన్స్ చేశారు.

అయితే ఏమైందో తెలీదుగానీ ఆ ప్రాజెక్టు నుంచి సమంతను అవుట్ చేశారనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది. ప్రేమ వ్యవహారం మీడియాలో బాగా నానుతున్న ఈ సమయంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వద్దనే నాగ్ ఈ పని చేశాడంటున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Samantha  Kalyanam  Rakul Preet Singh  Kalyan krishna  

Other Articles