150 కోట్ల మహేష్ సినిమా | Reliance 150 Crores deal with Mahesh-Murugadoss movie

Reliance 150 crores deal with mahesh murugadoss movie

Mahesh-Murugadoss movie, Reliance big deal with mahesh, 150 Crores deal for mahesh movie, Reliance grabbed Mahesh movie theatrical rights

Reliance group grabbed Mahesh-Murugadoss movie theatrical rights with 150 Crores deal.

150 కోట్ల మహేష్ సినిమా

Posted: 07/14/2016 10:32 AM IST
Reliance 150 crores deal with mahesh murugadoss movie

సూపర్ స్టార్ మహేష్ బాబు మురగదాస్ చిత్రం ఈ నెల 19న షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వాస్కోడిగామా టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఠాగూర్ మధు లియో ప్రొడక్షన్, ఫాక్స్ స్టార్ స్టూడియో, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ తోపాటు, దర్శకుడు మురగదాస్, హీరో మహేష్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

ఈ చిత్రం కోసం హ్యారిస్ జైరాస్ ఇప్పటికే స్వరాలు సమకూర్చే పనిలో బిజీగా ఉండగా, ఎస్ జే సూర్య విలన్ గా, రకుల్ ప్రీత్ హీరోయిన్ గా ఫిక్స్ చేసేశారు. ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో రూపొందించబోతున్న ఈ చిత్రానికి స్వయంగా సూపర్ స్టారే డబ్బింగ్ కూడా చెప్పబోతున్నాడంట. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ బిగ్ డీల్ కుదిరిందని సమాచారం.

ఈ సినిమా నిర్మాణ పార్ట్ నర్ గా ఉన్న రిలయన్స్ సంస్థ థియేట్రికల్ హక్కులను 150 కోట్లకు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ ఒప్పందం జరగగా, త్వరలో అధికారిక ప్రకటన చేయనుందట. అంతేకాదు హిందీలో కూడా డబ్ చేసి ఒకే రోజున రిలీజ్ చేయాలన్న ఆలోచనలో రిలయన్స్ ఉందట.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  reliance group  theatrical rights  150 crores  

Other Articles