యామీ యవ్వారం మొత్తం బయటపెట్టింది | Shwetha Rohira says Yami Gautam reason for their separation

Shwetha rohira says yami gautam reason for their separation

Shwetha Rohira about yami gautham, Yami Gautam reason for their break up, Shwetha Rohira about divorce

Shwetha Rohira says Yami Gautam reason for her and husband pulkit separation.

యామీ గౌతమ్ యవ్వారం మొత్తం బయటపెట్టింది

Posted: 07/13/2016 03:35 PM IST
Shwetha rohira says yami gautam reason for their separation

బాలీవుడ్ యంగ్ హీరో పుల్కిత్ సామ్రాట్ కాపురంలో నటి యామీ గౌతమ్ నిప్పులు పోసిందనేది ఈమధ్య అందరి నోళ్లలో నానుతుంది. అయితే రెండు రోజుల క్రితం పుల్కిత్ ఈ విషయంపై స్పందిస్తూ.. భార్య శ్వేత రోహిరా గర్భస్రావం తర్వాతే దూరం పెరిగిందని, తామింకా కలిసి ఉండటం కరెక్ట్ కాదని, ఇందులో యామీ తప్పేం లేదని వెనకేసుకొచ్చాడు. ఇప్పడు దీనిపైనా శ్వేతా రోహిరా ఓ ప్రకటన చేసింది.

మేము విడిపోవటానికి ముమ్మాటికీ కారణం యామీయే అని ఖరాఖండిగా చెబుతోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో ఉంటున్న తన తల్లి అపార్ట్ మెంట్ కి వచ్చి కుక్కతో ఆడుకునేంది. ఆ తర్వాత మెల్లిగా మా కుటుంబంలో ఓ సభ్యురాలిగా కిలిసిపోయింది. కానీ, భర్తకే ఎసరు పెడుతుందని ఊహించలేదు. చానా ఏళ్ల క్రితం నా భర్త పుల్కిత్ తో కలిసి ఓ వీడియో ఆల్బం కూడా చేసింది. కానీ, సనమ్ రే చిత్ర షూటింగ్ సమయంలోనే వారిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో యామీ మా కాపురంలో చిచ్చు పెట్టింది అని చెప్పుకోచ్చింది.

గతేడాది నా పుట్టిన రోజు సందర్భంగా విడిపోదామని నా భర్త చెప్పాడు. కానీ, కారణాలు చెప్పలేదు. అందుకు కారణం యామీ అని ఎవరికైనా అర్థమైపోతుందని తెలిపింది. ప్రస్తుతం వారిద్దరి సహజీవనం చేస్తున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం శ్వేతా స్పందించలేదు. తన రాఖీ చెల్లి కాపురం కోసం సల్మాన్ స్వయంగా రంగంలోకి సంప్రదింపు చర్చలు జరిపినప్పటికీ అవేం ఫలించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా పుల్కిత్, శ్వేతా స్పందించారు. ఇక తరువాయి వంతు యామీదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shwetha Rohira  Pulkit Samrat  Yami Gautam  divorce  sanam re  

Other Articles