అజిత్ సినిమాకి మెగాస్టార్ ప్రొడ్యూసర్ | Amithabh bachchan producing Ajith's 58

Amithabh bachchan producing ajith s 58

Amithabh bachchan, Ajith's 58, Big B for Thala 58, Ajith-Atlee movie producer

Amithabh bachchan producing for Ajith's 58 under Atlee's Direction.

అజిత్ సినిమాకి మెగాస్టార్ ప్రొడ్యూసర్

Posted: 07/12/2016 04:20 PM IST
Amithabh bachchan producing ajith s 58

తమిళ్ స్టార్ హీరో ‘తలా’ అజిత్ ప్రస్తుతం తన 57వ చిత్రంలో బిజీగా ఉన్నాడు. కాజల్ హీరోయిన్ గా వీరమ్, వేదాలం దర్శకుడు శివతోనే ఆ చిత్రం తీస్తున్నారు. అదే సమయంలో కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త భీభత్సమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్ 58వ చిత్రం ఇద్దరు స్టార్ డైరక్టర్లలో ఒకరితో ఉండొచ్చనే వార్తలు వచ్చాయి. ఇంతకీ దీనిని నిర్మించబోయేది ఎవరో తెలుసా? బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్.

యస్... బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. గతంలో అజిత్ - విక్రమ్ కథానాయకులుగా వచ్చిన 'ఉల్లాసం' చిత్రాన్ని నిర్మించిది అమితాబే. మళ్లీ ఇంతకాలానికి ఆయన ఓ తమిళ సినిమాను నిర్మించడం, అది కూడా తలాతో కావటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇక దర్శకులుగా అట్లీ .. విష్ణువర్ధన్ పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో విష్ణువర్ధన్ - అజిత్ ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. రాజారాణితోనే గాక విజయ్ తో చేసిన 'పోలీస్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అట్లీ తన సత్తా చూపించాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఆ లక్కీ చాన్స్ అమితాబ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amithabh bachchan  Ajith  Atlee  Thala 58  

Other Articles