power star pawan doing films very fast in this year

Power star pawan doing films very fast in this year

pawan kalyan movies, pawan kalyan and dolly, pawan director, pawan stills, pawan recent stills, pawan kalyan next movies, pawan upcoming directors, pawan new projects, pawan plans for elections, pawan future

power star pawan kalyan doing very fast for his movies. and director trivikram srinivas pawan combination coming onceagain in this year

అదే పవర్ స్టార్ పవర్..!

Posted: 07/12/2016 12:27 PM IST
Power star pawan doing films very fast in this year

పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పటిలాగే అనుకున్న సమయానికి షూటింగ్ ప్రారంభం కాలేదు. పైగా డైరెక్టర్ ని కూడ మార్చేశాడు. ఇప్పుడు డైరెక్టర్ డాలీ స్క్రిప్ట్ వర్క్స్ మాత్రమే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా ఈ సంవత్సరం రానట్లే అనుకున్నారు అందరూ. అయితే ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే పవన్ మాత్రం ఈసారి సినిమా విషయంలో కూడ ఇలాగే ఆలోచిస్తున్నాడట. అందరూ అనుకున్న ప్రకారం కాకుండా, ప్రస్తుతం డాలీ తో చేసే సినిమా కేవలం నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడని చెప్తున్నాయి పవన్ సన్నిహిత వర్గాలు.

తర్వాత కూడ పవన్ బండి బ్రేకులు లేకుండా వెళ్తుందట. డాలీకి ఆగష్ట్ నుంచి డిసెంబర్ వరకూ మాత్రమే గడువు అని అందుకే పవన్ ఆ టైమ్ లోనే డేట్స్ ఇచ్చాడని చెప్తున్నారు. తర్వాత డిసెంబర్ లో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా ప్రారంభం చేస్తాడని చెప్తున్నారు. అంతేకాదు, ఆ తర్వాత కూడ మరో ఇద్దరితో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు పవన్. గతంలో తనకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్ కూడ పవన్ కోసం కథని సిద్ధం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా దాసరి నారాయణరావు ఉంటారని, ఆయన సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుందని చెప్తున్నారు.
 
ఇదే సమయంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్లగణేష్ నిర్మాతగా మరో సినిమా తెరకెక్కనుందని కూడ చెప్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలకి అడ్వాన్స్ లు కూడ తీసుకున్నాడట. అయితే బండ్ల గణేష్ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదని చెప్తున్నారు. ఫిలిం నగర్ లో టాక్ ఏంటంటే, పూరీ జగన్ లేదా హరీష్ శంకర్ లలో ఎవరో ఒకరు ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు.

అంటే ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలకి పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. 2019 ఎలక్షన్స్ నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటాడు కాబట్టి సినిమాలు చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు సినీ పండితులు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  director dolly  trivikram srinivas  sruthihasan  harish shankar  

Other Articles