బాహుబలి కొత్త మేకింగ్ వీడియో | baahubali team new making video on one year release

Baahubali team new making video on one year release

Baahubali release date, Baahubali the begining release date, baahubali one year anniversary, baahubali part 2 news, baahubali the conclusion release date, baahubali new making video

Baahubali team released new making video on Movie completed 1 year on july 10.

బాహుబలి కొత్త మేకింగ్ వీడియో

Posted: 07/11/2016 11:23 AM IST
Baahubali team new making video on one year release

బాహుబలి ఈ పేరు వింటే చాలు ప్రతీ తెలుగోడి ఒళ్లు పులకరించిపోతుంది. భారీ బడ్జెట్ తో తెలుగు చలన చిత్ర స్థాయిని ఖండాంతరాలు దాటించిన జక్కన్న ప్రస్తుతం రెండో పార్ట్ ను చెక్కే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంతలో మరో మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్ లో దర్శనమిస్తోంది.

అయితే అదేం లీకేజ్ కాదులెండి. చిత్ర యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. జూలై 10 2015 ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఫస్ట్ పార్ట్ కి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ప్రభాస్, రానాల ప్రాక్టీసులతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం పడ్డ కృషి ఇందులో చూడవచ్చు. ధీవర సాంగ్ మేకింగ్, అవంతిక పోరాట పరాక్రమం, భల్లాలుడి అడవి దున్న ఫైట్ , ఇంటర్వెల్ సీన్, దేవసేన భల్లాలుడి సంభాషణ, ఆపై భద్ర (అడవిశేష్) తో శివుడి పోరాట సన్నివేశం, చివరగా కట్టప్ప తలపై కాలు ఉంచే సీన్ మొత్తం ఇందులో చూపించారు.

చూస్తుంటే సినిమా రిలీజ్ అయి అప్పుడే ఏడాది గడిచిపోయిందా అనిపిస్తోంది. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ జరుపుకుంటుండగా, వేల మందితో యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంపై అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. త్వరలో చైనాలో భారీ స్థాయిలో చిత్రం విడుదలయ్యేందుకు ముస్తాబౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  . rajamouli  july 10  making video  baahubali the conclusion  

Other Articles