రోబో 2.0 ఆగిపోయిందా? | Robo 2.0 movie schedule starts from August

Robo 2 0 movie schedule starts from august

Robo sequel, Lyca Productions, Robo 2.0.S, Rajanikanth health Rumour, Rajanikanth Robo suit cause illness, enthiran sequel

Lyca Productions condemn rumours on Robo sequel and next schedule starts from August

రోబో 2.0 ఆగిపోయిందా?

Posted: 07/09/2016 04:26 PM IST
Robo 2 0 movie schedule starts from august

భారీ బడ్జెట్ తో శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రోబో సీక్వెల్ ఆగిపోయిందా? రజనీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాను ఆపేశారా? కాస్టూమ్స్ దెబ్బకి తలైవా ఆరోగ్యం పాడైపోయిందన్న వార్తలు నిజమేనా? బడ్జెట్ కూడా సినిమాకు సమస్యగా మారిందా? గత కొద్దిరోజులుగా ఈ వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటన్నింటికి చిత్ర నిర్మాతలు ఇప్పుడు సమాధానమిచ్చారు.

నేరుగా రజనీకాంత్ ఆరోగ్య స్థితిపై స్పందించని ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రోబో 2.0 విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేందుకు యత్నించింది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగిపోలేదని లైకా క్రియేటివ్ రాజు మహాలింగం వెల్లడించారు. ఆగస్టు నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. అయితే రజనీ ఆరోగ్యస్థితిపై మాత్రం ఆయన స్పందించలేదు.

కాగా, ఇప్పటికే ఢిల్లీ, చెన్నైలోను ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్స్ ను పూర్తి అయ్యాయి. ఆపై రజనీ ఆరోగ్యంపై రూమర్లు రావటం, ఆ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దాంతో ఈ ప్రచారానికి తెర దింపడానికి ఈ చిత్ర నిర్మాతలు రంగంలోకి దిగారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పర్యవేక్షణలో శంకర్ బిజీగా ఉన్నారంట. కథ కథనాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానం హైరేంజ్ లో వాడుకుని సినిమాను తీర్చిదిద్దడానికి శంకర్ అహర్నిశలు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robo sequel  Robo 2.0  Lyca Production  Rajanikanth  Shankar  

Other Articles