ram charan teja doing many movies in this year

Ram charan teja doing many movies in this year

ramcharan teja, ram charan movie, ram charan next movie, ram charn teja, ram charan movies, ram charan directors, ramcharan upcoming movies, ramcharan next projects, ram charan teja projects

ram charan teja chiranjeevi son doing many more movies in this year. he is backward in the past two years. now he is decided to do more films regularly.

చెర్రీ బండి జోరుమీదుంది..!

Posted: 07/08/2016 02:45 PM IST
Ram charan teja doing many movies in this year

'గోవిందుడు అందరివాడేలే' సినిమా కొంచెం రామ్ చరణ్ తేజ్ కి ఉపశమనం ఇచ్చినా కూడ తర్వాత వచ్చిన 'బ్రూస్ లీ' సినిమా డిజాస్టర్ తో రామ్ చరణ్ మార్కెట్ ని ఒక్కసారిగా పడేసింది. దీంతో ఇప్పుడు చెర్రీ వరుసగా సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడు.  ప్రస్తుతం తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ సినిమాని 'ద్రువ' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే చెర్రీ తన బండికి గేర్లు మారుస్తున్నాడు. తన తర్వాత సినిమాలను చక చక ఓకే చేసేస్తున్నాడు. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్ లో ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా చెర్రీ మరో సినిమాకి కూడ శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం 'జనతాగ్యారేజ్' సినిమా చేస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడట. ఇక ఈ సంవత్సరమే ఈ రెండు సినిమాలు పట్టాలెక్కుతాయని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు. ఈ సినిమాల కథలు కూడ చాలా డిఫరెంట్ గా ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

అంతేకాకుండా, కృష్ణగాడి వీర ప్రేమగాథ డైరెక్టర్ హను రాఘవపూడి కూడ ఇటీవలే చరణ్ ని కలిసి ఒక కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కథ కూడ ఓకే అయితే మొత్తం మూడు సినిమాలు 2017లో రిలీజయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అందరూ. ఈ వార్త విన్న మెగా అభిమానులు అందరూ ఖుషీగా ఉన్నారు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramcharanteja  hero ramcharan  chiranjeevi son  ram charan druva  ram charan movies  

Other Articles