గోవుల మధ్య మన గోపాలుడు | Sharrath marar post Gopala Pawan Kalyan pic

Sharrath marar post gopala pawan kalyan pic

Shrrath marar Pawan Pic, Pawan kalyan with cows, Pawan in farmhouse

Sharrath marar post Gopala Pawan Kalyan pic

గోవుల మధ్య మన గోపాలుడు

Posted: 07/08/2016 10:04 AM IST
Sharrath marar post gopala pawan kalyan pic

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేసే సమయంలో షూటింగ్ లో ఎంత నిబద్ధతతో బిజీగా ఉంటారో... ఖాళీ సమయంలో కూడా ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటాడు. నిజానికి ఫ్యామిలీ కన్నా ఆయన శంకరపల్లి లోని ఫామ్ హౌజ్ లోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. స్వయంగా తన చేతులతోనే మొక్కలు నాటి కూరగాయలు, పండ్లు పండించడం అంటే పవన్ కి చాలా ఇష్టం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం డాలీ సినిమా ఇంకా ప్రారంభం కాకపోవటంతో  రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పనులు కూడా పవన్ స్వయంగా చూసుకుంటున్నాడు. ఇందుకోసం ఫామ్ హౌజ్ లోనే చిత్ర యూనిట్ సిట్టింగ్ వేసి చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో పవన్ ప్రకృతిని పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆ సమయంలో సన్నిహితుడు, నిర్మాత శరత్ మరార్ అక్కడే ఉన్నాడు. చుట్టూ ఆవులు ఉండటం, మధ్యలో పవన్ ఉండటంతో ఓ ఫోటో తీసుకున్నాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ... 'మన గోపాల' ప్రకృతి ఒడిలో గోవుల మధ్య ఇలా కనిపించాడు.. అంటూ కామెంట్ పెట్టారు. తమ సినిమాకి సంబంధించిన విషయాన్ని మాట్లాడటానికి తాను వెళ్లినట్టు ఆయన చెప్పారు. చుట్టూ గోవులు చేతిలో గొడుగు మధ్యలో గోపాలుడు... ఈ రేర్ పిక్ మీకోసం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sharrath marar  twitter  Gopala  

Other Articles