kalyan ram and anil ravipudi combination again in ntr arts

Kalyan ram and anil ravipudi combination again in ntr arts

kalyan ram, kalyanram recent movies, kalyanram after patas, kalyanram next movie, kalyan ram upcoming, kalyanram and anil ravipudi, kalyanram and puri jagan movie, kalyanram movies

hero kalyan ram and anil ravipudi combination again in ntr arts. this movie is coming on sets after completion of purijagan movie

పటాస్ తో మళ్లీ కుదిరింది...!

Posted: 07/01/2016 12:50 PM IST
Kalyan ram and anil ravipudi combination again in ntr arts

హీరో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ పూరీ జగన్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో మరోసారి పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అవకాశం ఇస్తున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం అనిల్ రావిపూడి సుప్రీమ్ సినిమా హిట్ తర్వాత హీరో రామ్ తో ఒక ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ ని డిఫెరంట్ పాత్రలో కొత్తగా చూపించబోతున్నాడట. అందుకే కళ్యాణ్ రామ్ సైతం మరోసారి ఆ యంగ్ డైరెక్టర్ కి అవకాశమిచ్చాడని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.

పటాస్ సినిమా హిట్ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ మార్కెట్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న పూరీ జగన్ సినిమా కూడ కళ్యాణ్ రామ్ మార్కెట్ ని మరింత పెంచే అవకాశం ఉంటుందని, అందుకే తర్వాత తన సొంత బ్యానర్ లోనే సినిమాలను నిర్మించాలని చూస్తున్నట్లుగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero kalyanram  kalyanram movies  ntr arts  director puri  director anil ravipudi  

Other Articles