ట్రైలర్: అక్కీ రుస్తుం కేక! | Akshay Kumar's Rustom trailer out

Akshay kumar s rustom trailer out

Akshay Kumar's Rustom trailer, Akshay Kumar as Rustom Pavri, Rustom trailer

Akshay Kumar's Rustom trailer out. A dashing naval officer, a beautiful wife and a perfect world. This was Naval Commander Rustom Pavri's life. Three fatal shots change their lives.

ట్రైలర్: అక్కీ రుస్తుం కేక!

Posted: 06/30/2016 12:22 PM IST
Akshay kumar s rustom trailer out

హిందీలో రియల్ స్టోరీలతో తెరకెక్కిన చిత్రాలకు ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. ఒకటి రెండు మినహా దాదాపు అలా వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్లు అయినవే. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ను బాలీవుడ్ అందించబోతుంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రుస్తుం చిత్ర ట్రైలర్ విడుదలైంది.

స్పెషల్ చబ్భీస్, బేబీ చిత్రాలను అందించిన నీరజ్ దేశ్ పాండే మరోసారి అక్షయ్ తో మ్యాజిక్ చేయబోతున్నాడని తెలిసిపోతుంది. టినూ సురేశ్ దర్శకత్వంలో వస్తున్న రుస్తుం 1959లో జరిగిన ఓ నేవీ ఆఫీసర్ కథతో తెరకెక్కింది. ఇక ట్రైలర్ ను పరిశీలిస్తే... టీడ్ రోల్ రుస్తుం పర్వి పాత్రలో అక్షయ్ కుమార్ అలరించనున్నాడు. ఇక అతని భార్య పాత్రలో గోవా బ్యూటీ ఇలియానా నటించింది. ఇషా గుప్తా, అర్జాన్ బవేజా, మిగతా పాత్రల్లో నటిస్తున్నారు.

దేశభక్తి ఊపిరిగా పీల్చుకునే ఓ సిన్సియర్ నేవీ ఆఫీసర్ పెళ్లి చేసుకుని భార్యతో హ్యాపీగా నివసిస్తుంటాడు. అంతలో ఓ రోజు భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకుంటాడు. అతని చేతిలో ఆమె బాయ్ ఫ్రెండ్ హత్యగావించబడతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలౌవుతుంది. జైలుకు వెళ్లిన రుస్తుంకు సపోర్ట్ గా ప్రజలంతా ఏకమౌతారు. దేశభక్తుడి ముసుగులో  నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ అధికారులు అతనికి వ్యతిరేకంగా ఉంటారు. మరీ రుస్తుం ఆ కేసు నుంచి ఎలా బయటపడతాడు, అందుకోసం అతనికి ఎవరెవరు సహకరిస్తారు, చివరకు ఏమైంది అన్నదే కథాంశం. ఎయిర్ లిప్ట్ లాంటి రియల్ బేస్డ్ కథతో హిట్ అందుకున్న అక్కీ మరోకటి తన ఖాతాలో వేసుకునేలాగానే ఉన్నాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  Rustom  Tinu Suresh Desai  

Other Articles