naga chaitanya and akhil engagement very soon

Naga chaitanya and akhil engagement very soon

samatha affair, naga chaitu, naga chaitu marriage, akhil , akhil love, akhil girl friend, akhil in love, chaitu love, chaitu and samantha

akkineni naga chaitanya and hero akhil engagement coming soon. there are love with girls one of samantha and akhil also love with sreya bhopal

అన్నదమ్ములిద్దరి నిశ్చితార్ధం...?

Posted: 06/28/2016 10:42 AM IST
Naga chaitanya and akhil engagement very soon

అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, సమంతల ప్రేమ పురాణం ఇటీవల బహిర్గతమైన సంగతి తెలిసిందే. దాంతో తనకు లైన్ క్లియర్ అయిందనుకున్నాడో ఏమో గానీ అఖిల్ కూడా తన ప్రేయసితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడట. ఈ విషయం కాస్త ఇరు కుటుంబీకులకి తెలిసిపోయింది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల అఖిల్ కి ఎలాంటి ఇబ్బంది లేదంట. అయితే, చైతూ ప్రేమకథే ఇంకా గాడిలో పడాల్సి ఉందట.

అఖిల్ ప్రేమించే అమ్మాయి నగరంలోని ఓ వ్యాపార వేత్త కుమార్తె అయిన శ్రేయ భూపాల్‌‌. న్యూయార్క్‌లో చదువుకున్న ఆమె డిజైనర్ పనిచేస్తున్నారు. మొత్తానికి అఖిల్ లవ్ స్టోరీ ఎలాంటి ట్విస్ట్ లేకుండానే సుఖాంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే చైతూ, సమంతలు కూడా త్వరలో ముసుగులు తొలగించి అందరిమధ్యా ఒక్కటయ్యేటట్లుగానే కనిపిస్తున్నారు. వీరి ప్రేమకు కుటుంబం నుండి ఫుల్ సపోర్ట్ ఉందిట. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య నటిస్తోన్న ‘ప్రేమమ్’ సినిమా పూర్తవగానే నిశ్చితార్థ వేడుక జరుగనుందిట. మరి ఇదే సమయంలో తమ్ముడు అఖిల్ నిశ్చితార్ధం కూడ కానిచ్చేటట్లే ఉన్నారు అక్కినేని వారు. మరి అన్నదమ్ములిద్దరి నిశ్చితార్ధ వేడుక ఏ రేంజ్ లో జరగనుందో అని తెగ మాట్లాడేసుకుంటున్నారు అందరూ.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naka Chaitanya  Akhil  Samantha  Engagement  

Other Articles