actress chandini personal interiew about mubai heroines

Actress chandini personal interiew about mubai heroines

heroine chandini, kundanapu bomma chandini, kundanapu bomma heroine, actress chandini persona, about mumbai heroines, chandini heroine, mumbai actress telugu, kundanapu bomma press meet

actress chandini recent movie released tollywood kundanapu bomma. she said that mubai heroines are not nessasory in telugu movies. we are ready to do any kind of chatechtors in telugu movies

వాళ్లలో ఉందేంటి ? మాలో లేనిదేంటి ?

Posted: 06/27/2016 11:49 AM IST
Actress chandini personal interiew about mubai heroines

టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా కుందనపు బొమ్మ.   రాఘ‌వేంద్రరావు, కీర‌వాణి, వ‌ర ముళ్లపూడి క‌లిసి చేసిన ఈ సినిమాలో సుధాకర్, సుధీర్ లీడ్ రోల్స్ చేయగా చాందిని చౌద‌రి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కుందనపు బొమ్మ తన మనసులోని మాటలెన్నో చెప్పింది.

వైజాగ్ లో పుట్టిన తనకు చిన్నప్పన్నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమని, బెంగుళూరులో ఇంజ‌నీరింగ్ చేస్తూ 'మ‌ధురం' అనే షార్ట్ ఫిల్మ్ చేశానని అదే 'కుంద‌న‌పు బొమ్మ' సినిమా ఛాన్స్ ను తెచ్చిపెట్టిందని చెప్పింది. మ‌హేష్ బాబు సినిమా కావడంతో 'బ్రహ్మోత్సవం' సినిమాలో స్పెష‌ల్ క్యారెక్టర్ చేశానని ఇకపై హీరోయిన్ గానే చేస్తానంది.

టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూస‌ర్స్ ముంబాయి హీరోయిన్స్ ఎందుకు కావాల‌నుకుంటున్నారో తెలియ‌డం లేదని, భాష రాని వాళ్లను ముంబాయి నుంచి తీసుకువ‌చ్చి మ‌రీ ఎందుకు అవ‌కాశాలు ఇస్తున్నారో అర్థం కావడంలేదంది చాందిని. ర‌జ‌నీకాంత్ తనకు ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చిన చాందిని, ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తున్నానని, త్వరలో బ్రహ్మానందంగారి అబ్బాయి గౌత‌మ్ తో క‌లిసి 'మను' అనే సినిమాలో న‌టిస్తున్నానని చెప్పింది. ఛాన్స్ రావాలేగానీ, గ్లామర్ పాత్రలతో పాటు ఎక్స్ పోజింగ్ కూడ సై అంటోంది ఈ సొగకళ్ల చిన్నది. కుర్రహీరోయిన్స్ కి ఇప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్ని రంగాల్లో ఆరితేరిన తర్వాతే సినిమా ఫీల్డ్ ని ఎంచుకుంటున్నారని, అవకాశాలు వస్తే వాళ్లేంటో నిరూపించుకుంటారని చెప్తోంది ఈ అమ్మడు.

ఇటీవలే విడదలయిన సినిమాలో తన నటనను అందరూ ప్రత్యేకంగా పొగుడుతున్నారని, దానికి చాలా సంతోషంగా ఉందని చెప్తోంది.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress chandini  chandini hot  chandini tollywood  telugu heroine chandini  

Other Articles