actress tamannah personal interview

Actress tamannah personal interview

tamannah interview, tamanna next movie, tamannah movie, tamannah abhinetri, tamannah oopiri, tamannah hot

actress tamannah next movie abhinetri coming soon. she is very confident that movie going to be big hit.

ఆ విషయంలో బెంగ లేదు..!

Posted: 06/24/2016 11:09 AM IST
Actress tamannah personal interview

బెంగాల్ టైగర్ సినిమా నిరాశపర్చినా కూడ తమన్నాకి టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గలేదు. బాహుబలి కన్ క్లూజన్ లో కీలకపాత్రలో నటిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ తన కెరియర్ లో పరాజయాలు, జయాలను లెక్కచేయనని చెప్తోంది. బాహుబలి, ఊపిరి సినిమాల్లో తన నటనతో అందర్ని ఆకట్టుకుంది తమన్నా. ప్రస్తుతం ధరమ్ దురై, అభినేత్రి, కత్తిసంధై సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు.

బాలీవుడ్ లో అంతగా కలిసిరాకపోయినా ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తన కెరియర్ లో అతి పెద్ద విజయాలు , ఊహించని పరాజయాలు ఉన్నాయని అయితే పరాజయాలు వచ్చినపుడు కుంగిపోకూడదని చెప్తోంది. నేను ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే నాకు రాజమౌళి గారు ఫోన్ చేసి బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చారని చెప్తోంది. ఈరోజు ఇది ఊహించలేదని, అది అదృష్టమే అని అంటోంది. అలాంటి అదృష్టం మళ్లీ కలిసి వస్తే బాలీవుడ్ లో మరోసారి కాలు పెడతానని అంటోంది.

ప్రస్తుతం 2016లో ఫుల్ బిజీగా ఉన్నానని అయినా కూడ వేరే సినిమా ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తానని అంటోంది. అభినేత్రి సినిమాలో మంచి పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్ర నాకు లభించిందని ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్తోంది.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannah  abhinetri movie  tamannah next movies  tamannah hot  

Other Articles