ఆ వీడియో సమంత-నాగచైతన్యదేనా? | samantha naga chaithanya fake video released

Samantha naga chaithanya fake video released

samantha naga chaithanya fake video released. bangalore person tweeted that video. media highlighted with open romance of samantha and chaithu.

samantha naga chaithanya fake video released. bangalore person tweeted that video. media highlighted with open romance of samantha and chaithu.

ఆ వీడియో సమంత-నాగచైతన్యదేనా?

Posted: 06/20/2016 05:50 PM IST
Samantha naga chaithanya fake video released

ఒక హీరోతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నానని ఏ టైంలో చెప్పిందోగానీ ఆ రోజు నుంచి మీడియా కళ్లన్నీ సమంత మీదే ఉన్నాయి. శామ్ తుమ్మినా దగ్గినా ఏం చేసినా దాన్ని హైలెట్ చేసి పాడేస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎన్’ లాకెట్ మాటేమోగానీ ఆ లవర్ నాగ చైతన్యనేనంటూ నిర్ధారించేసుకున్నాయి. అంతేకాదు ఇద్దరు కలిసి సినిమా చూడటం దగ్గరి నుంచి మొదలై, నాగ్ వీరిద్దరి లవ్ ట్రాక్ కి అడ్డుతగులుతున్నాడంటూ, తండ్రి కొడుకులిద్దరి మధ్య సమంత చిచ్చు పెట్టిందంటూ, చివరికి చైతూ తల్లి మాత్రం వీరిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఇలా రోజుకో గాసిప్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి రొమాన్స్ అంటూ విడుదలైన వీడియో సోషల్ మీడియలో షికారు చేస్తోంది.

పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... ఓ బాల్కనీలో గ్రీన్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి, పక్కనే ఓ అబ్బాయి (సమంత, చై అని వారి ఉద్దేశం) మాట్లాడుకోవటం అందులో కనిపిస్తోంది. ఇద్దరు సరదాగా కబుర్లు చెబుతుండగా, ఎవరో దూరం నుంచి ఆ వీడియోను చిత్రీకరించారు. అయితే అందులో ఉంది వారిద్దరు కాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకోవైపు అసలు ఇది నిజమో కాదో పట్టించుకోని మీడియా కూడా శామ్-చైతూ ఓపెన్ రొమాన్స్ అంటూ హెడ్డింగ్ లు పెట్టి ఊదరగొట్టేస్తుంది. ఇప్పటిదాకా ఈ ప్రేమ కహానీ పై అటు చైతూ గానీ, ఇటు సమంత గానీ ఓపెన్ గా చెప్పింది లేదు. అయితే నిప్పు లేనిదే పొగ మాత్రం రాదు కదా అని ఇంకొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  naga chaithanya  samantha naga chaithanya video  

Other Articles