'సరైనోడు’ సినిమాతో హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత సినిమా లింగుస్వామి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం బన్నీ తన లుక్ను మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించేందుకు లింగుస్వామి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. ఆర్టిస్టుల ఎంపిక విషయంలో, సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇందులో భాగంగానే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్టేజియస్ ప్రొజెక్ట్స్ లో ఎంతో బిజీగా ఉన్న డియస్ పి బన్నీ సినిమా అనేసరికి కాదనలేక ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమా , జూనియర్ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ ఇలా పెద్ద సినిమాలతో దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకే ముందుగానే బన్నీ కోసం దేవిశ్రీ ప్రసాద్ డేట్స్ బ్లాక్ చేశాడట లింగుస్వామి. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ఒక క్యారెక్టర్ కంప్లీట్ గా నెగిటివ్ గా ఉంటుందని చెప్తున్నారు ఫిలిం నగర్ వాసులు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more